News November 6, 2024

విశాఖ: జూ పార్క్‌లో సందడి వాతావరణం

image

నాగుల చవితి సందర్భాన్ని పురస్కరించుకొని విశాఖ ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్‌లో మంగళవారం సందడి వాతావరణం నెలకొంది. జూ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారు జూ పార్క్‌కు కుటుంబాలతో సహా తరలివచ్చి పుట్టల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పుట్టల్లో గుడ్లు వేసి పాలు పోసి సందడి చేశారు. బాణసంచాను జూ అధికారులు లోపలికి అనుమతించకపోవడంతో కొందరు నిరాశ చెందారు.

Similar News

News November 6, 2024

విశాఖ పోర్టుకు సముద్ర పర్యావరణ సురక్ష ట్రోఫీ

image

ప్రకృతి వైపరీత్యాల నివారణ ప్రణాళిక అమలులో అత్యుత్తమ పనితీరు కనపర్చినందుకు విశాఖ పోర్ట్ ట్రస్ట్ అథారిటీకి మంచి గుర్తింపు లభించింది. ఢిల్లీలో కోస్టుగార్డు ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో జాతీయ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కాంటిన్ జెన్సీ సమావేశంలో సముద్రి పర్యావరణ సురక్ష ట్రోఫీని అందజేశారు. ఈ విషయాన్ని విశాఖ పోర్టు కార్యదర్శి టి.వేణుగోపాల్ తెలిపారు.

News November 6, 2024

Dy.cm పవన్, లోకేశ్ ఫొటోల మార్ఫింగ్.. పోలీసుల అదుపులో విశాఖ వ్యక్తి

image

నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు క్రియేట్ చేసి రాష్ట్ర మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి అప్రతిష్ఠ పాలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను దువ్వాడ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విశాఖ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఎస్.రతన్ కాంత్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. 88వ వార్డు యాదవ జగ్గరాజుపేటకు చెందిన బి.వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

News November 6, 2024

రాష్ట్రంలో చంద్రన్న దోపిడీ పథకాలు: విజయసాయి రెడ్డి

image

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రన్న దోపిడి పథకాలను అమలు చేస్తున్నట్లు వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికగా విమర్శించారు. చంద్రన్న ఇసుక దోపిడి పథకం, చంద్రన్న మద్యం దోపిడి, చంద్రన్న విద్యుత్ దోపిడి, చంద్రన్న పింఛన్ల కోత పథకం, చంద్రన్న దీపం అర్హుల కోత పథకం, చంద్రన్న డూపర్ సిక్స్ పథకం, చంద్రన్న ఖనిజ దోపిడీ పథకాలను అమలు చేస్తుందని ధ్వజమెత్తారు.