News April 7, 2025
విశాఖ: ‘జేఈఈ పరీక్షకు విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలి’

జేఈఈ పరీక్షకు ట్రాఫిక్ అంతరాయం వలన ఆలస్యంగా వెళ్లిన 30 మంది విద్యార్థులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో అవకాశం కల్పించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యు.నాగరాజు విజ్ఞప్తి చేశారు. సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పెందుర్తి రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో జేఈఈ పరీక్షకు వెళ్లాల్సిన విద్యార్థులు ట్రాఫిక్ వలన హాజరు కాలేకపోయారని వీరందరికీ అవకాశం కల్పించాలని కోరారు.
Similar News
News April 8, 2025
విశాఖలో ఏడేళ్ల బాలుడి మృతి

విశాఖ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్‌లో రిషి(7) మృతి చెందాడు. గుట్టు చప్పుడు కాకుండా బైక్‌పై ప్రైవేట్ ఆసుపత్రికి స్పోర్ట్స్ క్లబ్ సిబ్బంది తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించగా.. బంధువులు ఆందోళనకు దిగినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 8, 2025
విశాఖలో నేటి కాయగూరల ధరలు

విశాఖ 13 రైతు బజార్లో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు మంగళవారం నాడు కాయగూరల ధరలను విడుదల చేశారు. (రూ.కేజీ)లో టమాటా రూ.16, ఉల్లిపాయలు రూ.21, బంగాళదుంపలు రూ.17, మిర్చి రూ.26, పికోడా మిర్చి రూ.60, క్యారెట్ రూ.36, మట్టి చామ రూ.28, చిలకడదుంపలు రూ.40, బద్ద చిక్కుడు రూ.62, మామిడి అల్లం రూ.55, కీరదోస రూ.24, కాలీఫ్లవర్ రూ. 20, బెండ రూ.28, బీరకాయలు రూ.42, వంకాయలు రూ.22/28 గా ధరలు నిర్ణయించారు.
News April 8, 2025
మధురవాడ: కడుపు నొప్పి తాళలేక ఉరి వేసుకుని మృతి

కడుపునొప్పి తాళలేక ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరం గ్రామానికి చెందిన చిత్తులూరి అప్పారావు(32) మధురవాడ రెవెన్యూ కాలనీలో నివాసం ఉంటూ ఓ హోటల్లో వంట మనిషిగా పని చేస్తున్నాడు. సోమవారం కడుపునొప్పి తాళలేక ఉరి వేసుకున్నట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు. మృతుడు వదిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.