News February 7, 2025
విశాఖ: టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి మరో నామినేషన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738924953485_20522720-normal-WIFI.webp)
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం నాలుగు నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. పీఆర్టీయూ మద్దతుతో బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, స్వతంత్ర అభ్యర్థులు నూకల సూర్యప్రకాష్,రాయల సత్యన్నారాయణ, పోతల దుర్గారావు తమ మద్దతుదారులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ వారి చేత ప్రమాణం చేయించారు.ఇప్పటి వరకు మొత్తం 8 నామినేషన్లు వచ్చాయి.
Similar News
News February 8, 2025
కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738942200070_20522720-normal-WIFI.webp)
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహా కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు వేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 10, 22 తేదీలలో రాత్రి 10.20 గంటలకు విశాఖ-గోరఖ్ పూర్ (08588) బయలుదేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 13, 25 తేదీలలో సాయంత్రం 5:45కు గోరఖ్‌పూర్‌లో బయలుదేరునుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 8, 2025
జాతీయస్థాయి అథ్లెటిక్స్‌లో విశాఖ క్రీడాకారులకు పతకాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738937600561_20522720-normal-WIFI.webp)
రాజస్థాన్‌లో జరుగుతున్న 44వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో విశాఖ నుంచి 33 క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 5 స్వర్ణ, 7రజత, 10 కాంస్య పతకాలను సాధించి విజేతలుగా నిలిచారు. వీరికి శుక్రవారం పలువురు అభినందనలు తెలిపారు. విశాఖ అథ్లెట్స్ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు.
News February 7, 2025
ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738937912393_20522720-normal-WIFI.webp)
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో అధికారులతో సమావేశమయ్యారు. నామినేషన్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వసతుల కల్పన, జాబితాల తయారీ, సిబ్బంది కేటాయింపు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలన్నారు.