News October 27, 2024

విశాఖ: ‘డయేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

డయేరియా పట్ల వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు ఆదేశించారు. శనివారం ఆయన సాగర్ నగర్, బాలాజీ నగర్‌లో గల పట్టణ ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించి డయేరియా లక్షణాలు కనిపిస్తే సత్వర చికిత్స అందించాలన్నారు. సకాలంలో గర్భిణీలు, బాలింతలకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలన్నారు.

Similar News

News November 27, 2025

విశాఖ: వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి యాంటీ రాబిస్ వ్యాక్సిన్

image

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి రాబిస్ వ్యాధి రాకుండా యాంటీ రాబిస్ వ్యాక్సిన్‌ను గురువారం వేశారు. జీవీఎంసీ పరిధిలో 50 మంది వీధి కుక్కలను పట్టుకునే సిబ్బందికి, శస్త్ర చికిత్సలు నిర్వహించే వారికి వ్యాక్సిన్ వేశారు. వీధి కుక్కలను పట్టుకునేటప్పుడు,శస్త్ర చికిత్సలు నిర్వహించినప్పుడు మానవతా దృక్పథంతో ప్రవర్తించి పట్టుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

News November 27, 2025

విశాఖ: రూ.1,12,03,480 ప్రాపర్టీ రికవరీ

image

విశాఖ సీపీ కార్యాలయంలో గురువారం ప్రాపర్టీ రికవరీ మేళా నిర్వహించారు. అక్టోబర్ నెలలో జరిగిన రికవరీ మేళాలో విశాఖ కమీషనరేట్ పరిధిలో నమోదైన కేసులను పోలీసులు చేధించి రూ.1,12,03,480 సొత్తును రికవరీ చేశారు. ఆ ప్రాపర్టీను సీపీ శంఖబ్రత బాగ్చి బాధితులకు అందించారు. మొత్తం 838.331 గ్రాముల బంగారం, 505 మొబైల్ ఫోన్స్, 22 ద్విచక్ర వాహనాలు, రూ.3,10,500 రికవరీ చేశారు. విశాఖ సీపీ ప్రతి నెల ఈ మేళా నిర్వస్తున్నారు.

News November 27, 2025

విశాఖ: మెడికల్ షాపుల్లో తనిఖీలు.. ఒకటి సీజ్

image

విశాఖలో పలుచోట్ల డ్రగ్ కంట్రోలర్ సిబ్బంది ఆధ్వర్యంలో మెడికల్ షాపుల తనిఖీలు చేపట్టారు. డాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోహన్ ఫార్మసీ దుకాణాలు నడుస్తున్నాయి. వీటిపై PGRSలో ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేసి ఎంవీపీ బ్రాంచ్ సీజ్ చేశారు. వన్ టౌన్, ఇసుకతోట, ఎంవీపీ, కంచరపాలెం, మల్కాపురం షాపులకు నోటీసులు జారీ చేసినట్లు డ్రగ్ కంట్రోలర్ తెలిపారు. అధిక ధరలు, కాలం చెల్లిన మందులు ఉన్నాయని ఆయన చెప్పారు.