News July 11, 2024

విశాఖ: డిగ్రీలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ గడువు పెంపు

image

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. 18 నుంచి 20 వరకు స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తారు. 23 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్‌లో మార్పులు చేసుకోవడానికి 27వ తేదీన అవకాశం కల్పిస్తారు. ఈ నెల 31న తొలి దశ సీట్ల కేటాయిస్తారు. >Share it

Similar News

News December 9, 2025

బీచ్ రోడ్డులో నేవీ ఉద్యోగుల పరిశుభ్రత కార్యక్రమం

image

ఆర్‌కే బీచ్‌లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. INS డేగాకు చెందిన నేవీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 30 మంది నావికులు,10 మంది అధికారులు బీచ్‌ ప్రాంతంలో చెత్తను తొలగించారు. ఈ డ్రైవ్‌ను స్వచ్ఛత పఖ్వాడాలో భాగంగా చేపట్టినట్లు నేవీ అధికారులు తెలిపారు. తీర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

News December 9, 2025

విశాఖ: రేపటి నుంచి 21 వ‌ర‌కు టెట్ ప‌రీక్ష‌

image

డిసెంబ‌ర్ 10 నుంచి 21వ తేదీ వ‌ర‌కు జిల్లాలోని 12 కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వ‌హించ‌నున్నట్లు డీఈఓ ప్రేమ్ కుమార్ మంగళవారం తెలిపారు. విశాఖ‌ జిల్లాలో 11 కేంద్రాలు, అన‌కాప‌ల్లి, మాక‌వ‌ర‌పాలెంలో ఒక కేంద్రం ఉంద‌ని పేర్కొన్నారు. మొత్తం 26,248 మంది అభ్య‌ర్థులు ప‌రీక్ష‌కు హాజ‌ర‌వుతున్న‌ట్లు వివ‌రించారు. ఉద‌యం 9.30 నుంచి 12 వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వ‌ర‌కు ప‌రీక్ష ఉంటుంద‌న్నారు.

News December 9, 2025

విశాఖలో ఆయిల్ పామ్ సాగుకు 100% రాయితీ

image

విశాఖ జిల్లాలో 100 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉద్యాన అధికారిణి శ్యామల తెలిపారు. రైతులకు 100% రాయితీపై మొక్కలు, అంతర పంటల నిర్వహణకు రూ.21,000 సాయం, డ్రిప్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇది 30 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం ఇస్తుందని, భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల రైతులు ఆర్‌బీకేల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.