News July 17, 2024
విశాఖ: డిగ్రీ ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్లో మార్పులు

ఏయూ పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు జులై 25వ తేదీ వరకు పొడిగించారు. స్పెషల్ కేటగిరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జులై 23 నుంచి 25 వరకు జరుగుతాయి. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్స్ నమోదు జులై 26 నుంచి 29 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్ మార్చుకోవడానికి ఈనెల 30న అవకాశం ఇచ్చారు. ఆగష్టు 3న సీట్ల కేటాయింపు ఉంటుంది.
Similar News
News December 13, 2025
విశాఖ: టెట్ పరీక్షకు 311 మంది గైర్హాజరు

విశాఖలో శనివారం 17 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 4,501 మంది అభ్యర్థులకు గానూ 4,190 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. డీఈవో ప్రేమ్ కుమార్ ఒక పరీక్ష కేంద్రాన్ని.. ఫ్లైయింగ్ స్క్వాడ్ 4 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో చెప్పారు.
News December 13, 2025
ఏయూ తెలుగు విభాగం రికార్డ్: 52 మందికి ఉపాధ్యాయ కొలువులు

ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అరుదైన రికార్డు సృష్టించింది. మెగా డీఎస్సీ-2025లో ఈ విభాగానికి చెందిన 52 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. వీరిని శాఖాధిపతి ఆచార్య జెర్రా అప్పారావు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఏ.నరసింహారావు పాల్గొని కొత్త టీచర్లను అభినందించారు. వందేళ్ల ఏయూ చరిత్రలో ఇదొక మధుర ఘట్టమని ఆచార్య అప్పారావు పేర్కొన్నారు.
News December 13, 2025
హెచ్పీవీని జాతీయ టీకాల జాబితాలో చేర్చాలి: విశాఖ సీపీ

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ (HPV) వ్యాక్సిన్ను జాతీయ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో చేర్చాలని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చైతన్య స్రవంతి, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసు, హోంగార్డుల కుమార్తెలకు (9-14 ఏళ్లు) ఏర్పాటు చేసిన ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఆయన శనివారం ప్రారంభించారు. వ్యాక్సిన్పై అవగాహన కల్పించేందుకు త్వరలో బీచ్ రోడ్డులో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.


