News September 3, 2024

విశాఖ: డిగ్రీ విద్యార్థులకు 19న క్విజ్ పోటీలు

image

ఆర్బీఐ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు ఈ నెల 19న ఆన్‌లైన్‌లో క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్‌లో గోడపత్రికను లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్‌తో కలిసి ఆవిష్కరించారు. విద్యార్థులు కనీసం ఇద్దరూ చొప్పున గ్రూప్‌గా ఏర్పడి 17లోగా వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారని అన్నారు.

Similar News

News January 10, 2026

విశాఖ: 12 నుంచి జిల్లా స్థాయి పోటీలు

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్రాంతి సందర్భంగా జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పోటీలు పాండురంగపురం వద్ద సోమవారం నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్‌ను విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆవిష్కరించారు. గాలిపటాలు ఎగురు వేయుట, తొక్కుడు బిళ్ల, ఏడు పెంకులాట, తాడు లాగుట, కర్ర సాము పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News January 10, 2026

విశాఖలో ముగిసిన ఇండియన్ లైట్‌హౌస్ ఫెస్టివల్ 3.0

image

విశాఖపట్నంలో జరిగిన ఇండియన్ లైట్‌హౌస్ ఫెస్టివల్ 3.0 ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ రూ.230 కోట్ల విలువైన పోర్ట్ ప్రాజెక్టులను ప్రారంభించడమే కాకుండా, ఏపీలో మొదటి లైట్‌హౌస్ మ్యూజియాన్ని ప్రకటించారు. గత దశాబ్దంలో లైట్‌హౌస్ టూరిజం 5 రెట్లు పెరిగిందని, దేశవ్యాప్తంగా మరిన్ని లైట్‌హౌస్‌లను పర్యాటక కేంద్రాలుగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు.

News January 10, 2026

విశాఖ రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేసిన డీఆర్ఎం

image

విశాఖ రైల్వే స్టేషన్లో వాల్తేర్ డీఆర్ఎం లలిత్ బోహ్ర శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులు సౌలభ్యం కోసం అదనపు టికెట్ కౌంటర్లు, టికెట్ వెండింగ్ మిషన్లు, తాగునీరును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు డోర్ వద్ద నిలుచుని ప్రయాణం చేయకూడదని సూచించారు. ప్లాట్ ఫారం అవతల నుంచి రైలు ఎక్కడం వంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని ఆర్పీఎఫ్ పోలీసులను ఆదేశించారు.