News September 3, 2024
విశాఖ: డిగ్రీ విద్యార్థులకు 19న క్విజ్ పోటీలు
ఆర్బీఐ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు ఈ నెల 19న ఆన్‌లైన్‌లో క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్‌లో గోడపత్రికను లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్‌తో కలిసి ఆవిష్కరించారు. విద్యార్థులు కనీసం ఇద్దరూ చొప్పున గ్రూప్‌గా ఏర్పడి 17లోగా వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారని అన్నారు.
Similar News
News September 13, 2024
విశాఖ: బ్లాస్ట్ ఫర్నేస్-3 ని మూసివేసిన అధికారులు
అతిపెద్ద కర్మాగారం అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడే దిశగా అడుగులు వేస్తున్నట్లు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం స్టీల్ ప్లాంట్‌లో బ్లాస్ట్ ఫర్నేస్ -3ని అధికారులు మూసివేశారు. బొగ్గు లేకపోవడం వల్ల దీనిని మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే బ్లాస్ట్ ఫర్నేస్ -1 మూతపడింది. రూ8 వేల కోట్ల అప్పుల్లో స్టీల్ ప్లాంట్ మునిగిపోయినట్లు కార్మికులు తెలిపారు.
News September 13, 2024
వరద బాధితుల కోసం విశాఖ పోర్టు రూ.కోటి విరాళం
విజయవాడల వరద ప్రభావిత ప్రాంత ప్రజల సహాయార్థం విశాఖపట్నం పోర్టు అథారిటీ రూ.కోటి విరాళం ఇచ్చింది. పోర్ట్ కార్యదర్శి టి.వేణు గోపాల్, వివిధ విభాగాధిపతులు విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్ర ప్రసాద్‌కు సంబంధిత నగదు చెక్‌ను అందజేశారు. కార్మిక సంఘాలు, ఉద్యోగులు తమ వంతు సహకారం అందజేశారని యాజమాన్యం తెలిపింది.
News September 13, 2024
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిజిటలైజేషన్ ప్రక్రియ
ఏయూలో 23 లక్షల ధ్రువపత్రాలను 1996 నుంచి డిజిటలైజేషన్ చేస్తామని ఏయూ వీసీ శశిభూషణరావు తెలిపారు. ఇందులో మార్కుల జాబితాలు, ఓడీలు ఉంటాయన్నారు. 2023 నుంచి ఏయూలో చదువుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లను అకాడమీ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)లో ఉంచుతామన్నారు. ఏబీసీకి సంబంధించి ప్రతి విద్యార్థికి ఒక కోడ్ ఉంటుందన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియను ఒక సంస్థకు అప్పగిస్తామన్నారు.