News February 5, 2025
విశాఖ డివిజన్ పరిధిలోకి వచ్చే రైల్వే లైన్లు ఇవే

➤ పలాస – <<15366937>>విశాఖపట్నం<<>> – దువ్వాడ
➤ కూనేరు – విజయనగరం
➤ నౌపడ – పర్లాకిముండి
➤ బొబ్బిలి – సాలూరు
➤ సింహాచలం నార్త్ – దువ్వాడ బైపాస్
➤ వడ్లపుడి – దువ్వాడ
➤ విశాఖ స్టీల్ ప్లాంట్ – జగ్గయ్యపాలెం
Similar News
News October 26, 2025
మొంథా తుఫాన్పై అప్రమత్తత అవసరం: ఎంపీ కేశినేని

మొంథా తుఫాన్ రానున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ కేశినేని శివనాథ్ కలెక్టర్ లక్ష్మీశాతో ఫోన్లో మాట్లాడారు. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో చేపడుతున్న ఏర్పాట్ల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు.
News October 26, 2025
పిట్లం: వృద్ధ తండ్రికి కల్లులో విషం.. కొడుకు ఘాతుకం!

వృద్ధుడైన తన తండ్రికి సేవ చేయడం భారంగా భావించిన కొడుకు..కల్లులో విషం కలిపి హత్య చేశాడు. ఈ ఘటన పిట్లం (M) గౌరారం తండాలో శుక్రవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SI వెంకట్ రావ్ వివరాలిలా..తండా వాసి దశరథ్ కొడుకు వామన్ వద్ద ఉంటున్నాడు. తండ్రికి వృద్ధాప్య సేవలు చేయలేక వామన్ కల్లులో విషం కలిపి ఇచ్చి హతమార్చాడు. కేసు నమోదు చేసి, నిందితుడైన వామన్ను ఇవాళ రిమాండ్కు తరలించినట్లు SI వివరించారు.
News October 26, 2025
కృష్ణా: తుఫాన్ ప్రభావంపై డీపీఓ హెచ్చరిక

తుఫాన్ ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారిణి (డీపీఓ) జె.అరుణ సూచించారు. మట్టి మిద్దెలు, కల్వర్టులు, పూరి గుడిసెలు, రోడ్డు పక్కన గుడారాల్లో నివసించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. సచివాలయ ఉద్యోగులు, వీఆర్ఓలు, కార్యదర్శులు, ఇతర సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.


