News December 7, 2024

విశాఖ: డీప్ టెక్ సదస్సులో ఏడు ఒప్పందాలు

image

విశాఖ వేదిక‌గా శుక్ర‌వారం జ‌రిగిన డీప్ టెక్ స‌ద‌స్సులో GFST(గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్‌ఫర్‌మేషన్)కు వివిధ కంపెనీల మ‌ధ్య ఏడు ఒప్పందాలు జ‌రిగాయి. విద్య‌, వైద్య రంగాల్లో టెక్నాల‌జీ, అడ్వాన్స్‌డ్ స్ట‌డీస్, మహిళా సాధికార‌త త‌దిత‌ర అంశాల‌పై GFSTతో స‌మ‌గ్ర‌, జీఎస్‌ఆర్, ఫ్లూయింట్ గ్రిడ్ లిమిటెడ్, జ‌ర్మ‌న్ వ‌ర్శిటీ ఒప్పందాలు చేసుకోగా, గేమ్ కంపెనీ రెండు ఎంవోయూలు చేసుకుంది.

Similar News

News December 8, 2025

MVP రైతు బజార్ నుంచి ఆన్లైన్‌లో కూరగాయలు

image

MVP రైతు బజార్ నుంచి ఆన్లైన్లో కూరగాయలు లభ్యమవుతున్నాయి. పైలెట్ ప్రాజెక్టుగా విశాఖలో అమలు చేస్తున్న అధికారులు దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. రైతు బజార్ ధరలకే డోర్ డెలివరీ చేస్తున్నారు. మాచింట్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థ https://digirythubazaarap.com వెబ్సైట్ ద్వారా 5 రోజులుగా 150 మందికి డెలివరీ చేసింది. ప్రస్తుతం ఎలాంటి అదనపు చార్జీలు లేవు.

News December 8, 2025

విశాఖ కలెక్టరేట్‌ నేడు PGRS కార్యక్రమం

image

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.