News January 21, 2025
విశాఖ డీసీపీగా కృష్ణకాంత్ పాటిల్

విశాఖ డీసీపీగా కృష్ణకాంత్ పాటిల్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర మొత్తం మీద 27 మంది ఐపీఎస్‌లను బదిలీ చేశారు. అల్లూరి సీతారామరాజు అదనపు ఎస్పీగా ధీరజ్, అల్లూరి సీతారామరాజు ఆపరేషన్ అదనపు ఎస్పీగా జగదీశ్‌ను నియమించింది. ఇటీవల కాలంలో అధిక సంఖ్యలో ఐపీఎస్‌లను బదిలీ చేయడం గమనార్హం.
Similar News
News November 18, 2025
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న బాలకృష్ణ

సింహాచలం దేవస్థానంలో అప్పన్న స్వామిని సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ దర్శించుకున్నారు. మంగళవారం సింహాచలం వచ్చిన బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనుని ఏఈవో తిరుమల ఈశ్వరరావు, వేద పండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం అఖండ-2 సినిమా సాంగ్‌ను విడుదల చేయనున్నారు.

విశాఖ: బాలోత్సవం-2025 పోస్టర్ ఆవిష్కరణ

ఆనందపురంలో డిసెంబర్ 9–11వ తేదీల్లో సెయింట్ ఆంథోనీ పాఠశాలలో జరగనున్న 3వ మహా విశాఖ బాలోత్సవం-2025 పోస్టర్‌ను DEO ఎన్.ప్రేమకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం నిర్వాహకులు, సేవా సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. గత సంవత్సరం 8,000 కంటే ఎక్కువ మంది పిల్లలు పాల్గొన్న నేపథ్యంలో ఈసారి మరింత విస్తృతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ పూర్తి సహకారం ప్రకటించింది.