News January 21, 2025

విశాఖ డీసీపీగా కృష్ణకాంత్ పాటిల్

image

విశాఖ డీసీపీగా కృష్ణకాంత్ పాటిల్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం  ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర మొత్తం మీద 27 మంది ఐపీఎస్‌లను బదిలీ చేశారు. అల్లూరి సీతారామరాజు అదనపు ఎస్పీగా ధీరజ్, అల్లూరి సీతారామరాజు ఆపరేషన్ అదనపు ఎస్పీగా జగదీశ్‌ను నియమించింది. ఇటీవల కాలంలో అధిక సంఖ్యలో ఐపీఎస్‌లను బదిలీ చేయడం గమనార్హం.

Similar News

News April 11, 2026

విశాఖ-సికింద్రాబాద్‌ రూట్ టాప్ రద్దీ మార్గం..

image

విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు భారీ ఆదరణ లభిస్తోంది. 2025-26లో ఈ రూట్‌లో 48 లక్షల మంది ప్రయాణించడంతో దక్షిణాదిలో టాప్ రద్దీ మార్గంగా నిలిచింది. వేగం, సౌకర్యం, సమయపాలనతో ప్రయాణికులు ఈ రైలును ఎక్కువగా ఎంచుకుంటున్నారు. హైదరాబాద్-విశాఖ మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో ఉద్యోగులు, వ్యాపారులు, పర్యాటకులకు ఇది కీలకంగా మారింది. ఈ కనెక్టివిటీతో 2 నగరాల మధ్య ఆర్థిక, సామాజిక అనుబంధం మరింత బలపడుతోంది.

News April 11, 2026

విశాఖ: ఏప్రిల్ 15న జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

image

జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన ఈనెల 15న జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఈవో పి.నారాయణమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వివిధ స్థాయీ సంఘాల సమావేశాలు వేర్వేరుగా జరుగుతాయన్నారు. సభ్యులు, అధికారులు ప్రగతి నివేదికలతో హాజరుకావాలని కోరారు.