News November 22, 2024
విశాఖ డెయిరీకి గడ్డుకాలం..!
విశాఖ డెయిరీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. పాల సేకరణ ధరలు తగ్గించారంటూ మొన్నటి వరకు పాడి రైతులు ఆందోళన చేయగా.. డెయిరీలో అవినీతిపై స్థాయీ సంఘం ఏర్పాటు చేస్తామని స్పీకర్ అయ్యన్న బుధవారం ప్రకటించారు. తమ న్యాయపరమైన డిమాండ్లు తీర్చాలంటూ పర్మినెంట్, కాంట్రాక్టర్ ఉద్యోగులు గురువారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ పరిణామాలు డెయిరీ మనుగడపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Similar News
News November 23, 2024
మహిళా ఎమ్మెల్యేలతో హోంమంత్రి సెల్ఫీ
అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మహిళా ఎమ్మెల్యేలతో సరదాగా గడిపారు. వారితో కలిసి సెల్ఫీ దిగారు. అసెంబ్లీ సమావేశాల్లో మహిళా ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొన్నారని హోంమంత్రి పేర్కొన్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జన్మదినం కావడంతో కేక్ కట్ చేశారు.
News November 22, 2024
విశాఖ, అరకులో యాంకర్ హబ్‌లు: మంత్రి దుర్గేశ్
విశాఖ, అరకులో యాంకర్ హబ్‌లు ఏర్పాటు చేస్తామని టూరిజం మంత్రి కందుల దుర్గేశ్ అసెంబ్లీలో ప్రకటించారు. తొట్లకొండతో పాటు పలు బౌద్ధ క్షేత్రాలను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ నుంచి క్రూయిజ్ సేవలు విస్తరిస్తామన్నారు. బీచ్ టూరిజం సర్క్యూట్లో భాగంగా విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో బీచ్‌ల అభివృద్ధితో పాటు ఎకో టూరిజాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. బొర్రా గుహలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
News November 22, 2024
మంచు తెరల్లో పొద్దుతిరుగుడు అందాలు
ఇదేదో గ్రాఫిక్స్ ఫొటో..లేదా వాల్ పేపర్ ఫొటో అనుకుంటే మీ పొరపాటే.! డుంబ్రిగూడ మండలంలోని జంగిడివలస రైల్వే గేటు సమీపంలో స్థానిక గిరిజనులు వేసిన పొద్దుతిరుగుడు పువ్వుల పంట ఇది. ఒకపక్క ఆహ్లాదకరమైన మంచు తెరలు.. మరోపక్క ఆకర్షించే ఈ పొద్దుతిరుగుడు పువ్వుల అందాలు ప్రకృతి ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. మైదాన ప్రాంతానికి చెందిన పర్యాటకులు ఈ అద్భుతమైన దృశ్యాలను చూసి ఫిదా అవుతున్నారు.