News October 28, 2024
విశాఖ డెయిరీ యాజమాన్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

విశాఖ డెయిరీ యాజమాన్యం గాజువాక మండలం మింది గ్రామ పరిధిలో రూ.100 కోట్ల విలువచేసే మూడు ఎకరాల భూమిని కబ్జా చేసిందని జీవీఎంసీ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. అదే గ్రామ పరిధిలో ఏపీఐఐసీ నుంచి పాల ఉత్పత్తి పరిశ్రమకు మరో 19.36 ఎకరాల భూమిని అక్రమంగా పొందినట్లు వివరించారు. ఈ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు.
Similar News
News December 13, 2025
నేడు AU పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం

AU పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం ‘వేవ్స్–2025’ను మహిళా సాధికారత థీమ్‌తో శనివారం నిర్వహించనున్నారు. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్, మూర్తి ట్రస్ట్ చైర్పర్సన్ సుధా మూర్తి, ఏయూ ఆలుమ్ని వ్యవస్థాపక అధ్యక్షుడు, GMR అధినేత జి.ఎం.రావు తదితరులు పాల్గొననున్నారు.
News December 12, 2025
విశాఖ నుంచి తిరుగుపయనమైన సీఎం

ఒకరోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు విశాఖకు శుక్రవారం వచ్చారు. విశాఖలో పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమై, పలు కంపెనీలకు మంత్రులు, అధికారులతో శంకుస్థాపన చేపట్టారు. అనంతరం వైజాగ్ ఎకానమిక్ రీజియన్ అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం తిరుగు పయనమయ్యారు. ఆయనకు ఎయిర్ పోర్ట్‌లో కూటమి నాయకులు, అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు.
News December 12, 2025
అక్రమ మద్యంపై ఉక్కుపాదం: మంత్రి కొల్లు రవీంద్ర

విశాఖలో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర 4 జిల్లాల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అధికారుల ఏడాది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. బెల్ట్ షాపులు, నాటు సారా, కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని అధికారులకు స్పష్టం చేశారు.


