News December 9, 2024
విశాఖ డైరీకి పూర్వ వైభవం తెస్తాం: స్పెషల్ హౌస్ కమిటీ

విశాఖ డైరీ అక్రమాలపై ఏర్పాటు చేసిన స్పెషల్ హౌస్ కమిటీ సోమవారం కలెక్టరేట్లో రివ్యూ జరిపింది. మేనేజంగ్ డైరెక్టర్ గారు కంపెనీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, త్రిప్ట్ సొసైటీ ద్వారా నిధుల మల్లింపు ఆరోపణలపైన కూడా వివరం కోరామని అన్నారు. రైతులకు న్యాయం చేసి రాజకీయాలకు అతీతంగా డెయిరీని అభివృద్ధి చేయడమే ఈ హౌసింగ్ కమిటీ లక్ష్యమని అన్నారు. అధికారులు సహకరిస్తే సాధ్యమని తెలిపారు.
Similar News
News October 31, 2025
విశాఖ: పట్టణ ప్రణాళిక అధికారులులతో మేయర్ సమీక్ష

GVMC పరిధిలో ఎన్ని ప్రకటనల హోర్డింగు బోర్డులు ఉన్నాయి వాటి పూర్తి వివరాలను నివేదించాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు GVMC పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం GVMC కార్యాలయంలో పట్టణ ప్రణాళిక అధికారులు, ప్రకటన హోర్డింగుల ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పార్ట్నర్షిప్ సమ్మిట్కు ప్రకటన బోర్డులను ప్రదర్శించడానికి వాటికి ఎంత వసూలు చేస్తున్నారో వివరాలను అడిగి తెలుసుకున్నారు.
News October 31, 2025
UPSC పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు: విశాఖ JC

నవంబర్ 2న నిర్వహించనున్న UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 7 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 3268 మంది హాజరుకానునట్లు వెల్లడించారు. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని JC ఆదేశించారు.
News October 31, 2025
విశాఖ: ఆర్టీసీలో డ్రైవర్ పోస్ట్ల భర్తీ

ఆర్టీసీలో పదోన్నతుల కారణంగా డ్రైవర్ పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయని రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. ఐటీఐ చేసి 18 నెలల హెవీ డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారిని ఎంపిక చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఔట్సోర్సింగ్ పద్ధతిలో అన్కాల్ డ్రైవర్గా తీసుకోవడం జరుగుతుందని, దగ్గర్లో ఉన్న డిపోల్లో మేనేజర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.


