News December 6, 2024

విశాఖ: డ్రగ్స్ కాదు.. డ్రై ఈస్ట్

image

ఈ ఏడాది మార్చిలో ఎన్నికల వేళ విశాఖ పోర్టుకి బ్రెజిల్ నుంచి 25 వేల టన్నుల డ్రగ్స్ వచ్చిందన్న వార్త సంచలనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రంగంలోకి దిగిన సీబీఐ తాజాగా విచారణను ముగించింది. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్‌లో డ్రగ్స్‌ లేదని కేవలం డ్రై ఈస్ట్ ఉన్నట్లు కోర్టుకు నివేదిక సమర్పించింది. దీంతో సీజ్ చేసిన షిప్‌ను విడుదల చేసినట్లు కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ తెలిపారు.

Similar News

News December 4, 2025

విశాఖలో నేవీ అమరవీరులకు నివాళి

image

విశాఖ బీచ్ రోడ్డులోని ‘విక్టరీ ఎట్ సీ’ వద్ద తూర్పునౌకదళ అధికారులు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అమరులైన నావిక దళ వీరులకు నివాళులర్పించారు. రక్షణ వ్యవస్థలో తూర్పునౌకదళం కీలకంగా పనిచేస్తుందని వారు కొనియాడారు. నేవీ డే సందర్భంగా గురువారం ఉదయం ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ ఏడాది విశాఖలో నేవీ డే విన్యాసాలను నిర్వహించకపోవడంతో నగరవాసులు నిరుత్సాహానికి గురయ్యారు.

News December 4, 2025

జీవీఎంసీలో విలీనం కానున్న గ్రామీణ మండలాలివే..!

image

ఉమ్మడి విశాఖ జిల్లా విభజన అనంతరం మిగిలిపోయిన 4 మండలాలైన ఆనందపురం, పద్మనాభం, భీమిలి, పెందుర్తిని GVMCలో విలీనం చేసే ప్రక్రియ జరుగుతోంది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని 3 గ్రామీణ మండలాలు (భీమిలి, పద్మనాభం, ఆనందపురం) GVMCలో కలిపేందుకు CM చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, నారాయణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తెలిపారు. దీంతో GVMC పరిధి విస్తరణతో పాటు వార్డులు కూడా పెరగనున్నాయి.

News December 4, 2025

వాల్తేరు డివిజన్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేత

image

గరివిడి-సిగడం-చీపురుపల్లి సెక్షన్‌లో ఆటో సిగ్నలింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజనల్ కార్యాలయం బుధవారం తెలిపింది. ఈనెల 6, 7, 8 తేదీల్లో విశాఖ-పలాస మెము (67289/67290), విశాఖ-బ్రహ్మపురం ప్యాసింజర్ (58531/58532), విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ (18525/18526) సేవలు నిలిపివేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.