News June 29, 2024

విశాఖ: డ్రెడ్జ్-8 నౌకకు అత్యవసర మరామత్తులు పూర్తి

image

విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డ్‌లో కేవలం ఐదు రోజుల్లోనే అత్యవసర డ్రై డాకింగ్ పనులను విజయవంతంగా పూర్తి చేసింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన డ్రెడ్జ్-8 నౌక అత్యవసర మరమ్మతుల కోసం ఈనెల 21న తీసుకువచ్చారు. సంస్థ అధికారులు, సిబ్బంది 24 గంటల ప్రణాళికతో ఐదు రోజుల్లో పనులు పూర్తి చేశారు. ఈ నౌకను 1977లో నిర్మించినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News December 11, 2025

విశాఖ కోస్టల్ సెక్యూరిటీ సిబ్బందికి ‘ఈ-ఆఫీస్’ శిక్షణ

image

విశాఖ కోస్టల్ సెక్యూరిటీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఈ-ఆఫీస్ శిక్షణ కార్యక్రమం జరిగింది. అదనపు ఎస్పీ జీబీఆర్.మధుసూదనరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎన్‌ఐసీ బృందం పోలీసు సిబ్బందికి ఈ-ఫైలింగ్, డిజిటల్ సిగ్నేచర్ల వినియోగంపై సమగ్ర శిక్షణ ఇచ్చింది. పరిపాలనలో పారదర్శకత, కాగిత రహిత సేవల కోసమే ఈ శిక్షణని అదనపు ఎస్పీ తెలిపారు.

News December 11, 2025

రాత్రికి విశాఖ చేరుకోనున్నమంత్రి లోకేశ్

image

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం రాత్రి విశాఖ చేరుకోనున్నారు. రాత్రి 9 గంటలకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్తారు. డిసెంబరు 12న శుక్రవారం మధురవాడ ఐటీ హిల్స్‌లో పలు ఐటీ సంస్థల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కాపులుప్పాడలో జరిగే కాగ్నిజెంట్ కంపెనీ భూమి పూజ కార్యక్రమానికి హాజరవుతారు.

News December 11, 2025

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్

image

సీఎం చంద్రబాబు రేపు కపులుప్పాడలో కాగ్నిజెంట్ సహా ఐటీ పరిశ్రమల శంకుస్థాపనకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం భీమిలి–కపులుప్పాడ ప్రాంతాల్లో ఏర్పాట్లు పరిశీలించారు. రోడ్లు, భద్రత, పార్కింగ్ వంటి ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేశారు. సీఎం పర్యటనలో లోపాలేమీ లేకుండా పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.