News October 7, 2024
విశాఖ: ఢిల్లీలో జరిగిన సదస్సులో పాల్గొన్న హోంమంత్రి
ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు నిర్వహించిన సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరపున అనిత పాల్గొన్నారు. మావోయిస్టుల కట్టడి, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, కార్యచరణ ప్రణాళికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు హోం మంత్రి తెలిపారు.
Similar News
News November 6, 2024
బీఈడీ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్న ఏయూ
AU లో బీఈడీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలలో జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు డిప్యూటీ రిజిస్ట్రార్ (పరీక్షలు) ఎం.పద్మరాజు ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 13 నుంచి జరగనున్న బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన వివరాలను AU వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వీటి ఆధారంగా విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలి.
News November 6, 2024
విశాఖ: జూ పార్క్‌లో సందడి వాతావరణం
నాగుల చవితి సందర్భాన్ని పురస్కరించుకొని విశాఖ ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్‌లో మంగళవారం సందడి వాతావరణం నెలకొంది. జూ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారు జూ పార్క్‌కు కుటుంబాలతో సహా తరలివచ్చి పుట్టల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పుట్టల్లో గుడ్లు వేసి పాలు పోసి సందడి చేశారు. బాణసంచాను జూ అధికారులు లోపలికి అనుమతించకపోవడంతో కొందరు నిరాశ చెందారు.
News November 5, 2024
సింహాచలం: పంచ గ్రామాల్లో ఇళ్లకు మరమ్మతులు చేసుకోవచ్చు
సింహాచలం ఆలయం పరిధిలో గల పంచ గ్రామాల్లో ఇళ్లకు మరమ్మతులు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆలయం పరిధిలో గల పంచ గ్రామాల్లో ఇళ్లకు మరమ్మతులు చేయించడం, పైఅంతస్తులు నిర్మించుకోవడం చెల్లదు. దీనిపై గతంలో కోర్టులు కూడా యథాతథస్థితిని ప్రకటించాయి. నిబంధనలు సడలిస్తూ దేవాదాయ శాఖ మెమో జారీ చేసింది. దీనిపై పంచ గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.