News April 5, 2025
విశాఖ: తండ్రి బైకు కొని ఇవ్వలేదని కొడుకు ఆత్మహత్య

తండ్రి బైకు కొని ఇవ్వలేదని కారణంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖ నగరంలో వెలుగు చూసింది. రామా టాకీస్ ప్రాంతంలో నివాసముంటున్న కార్తీక్ తండ్రి వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. కార్తీక్ కొద్దిరోజులుగా బైక్ కోసం తండ్రితో గొడవ పడేవాడు. బైకు కొనకపోవడంతో ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ద్వారక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 7, 2025
విశాఖ: ‘జేఈఈ పరీక్షకు విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలి’

జేఈఈ పరీక్షకు ట్రాఫిక్ అంతరాయం వలన ఆలస్యంగా వెళ్లిన 30 మంది విద్యార్థులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో అవకాశం కల్పించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యు.నాగరాజు విజ్ఞప్తి చేశారు. సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పెందుర్తి రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో జేఈఈ పరీక్షకు వెళ్లాల్సిన విద్యార్థులు ట్రాఫిక్ వలన హాజరు కాలేకపోయారని వీరందరికీ అవకాశం కల్పించాలని కోరారు.
News April 7, 2025
విశాఖలో కేజీ అల్లం ధర ఎంతంటే?

విశాఖ 13 రైతు బజార్లలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సోమవారం కాయగూరల ధరలను విడుదల చేశారు. (రూ. కిలో) టమాట రూ.17, ఉల్లిపాయలు రూ.22, బంగాళా దుంపలు రూ.17, బెండకాయలు రూ. 28, కాకరకాయలు రూ.34, క్యారెట్ రూ.32/34, మునగ కాడలు రూ.24, అల్లం రూ.48, బరబాటి రూ.30, బీట్రూట్ రూ.24, బీన్స్ రూ.50, పాటల్స్ రూ.64, చామ రూ.26, దేవుడు చిక్కుడు రూ.60, గ్రీన్ పీస్ రూ.60గా ధరల నిర్ణయించారు.
News April 7, 2025
విశాఖ: వైసీపీకి చొక్కాకుల రాజీనామా

విశాఖలో YCPకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న చొక్కాకుల వెంకటరావు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గతంలో ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా, పెట్రో కెమికల్ అర్బన్ డెవలప్మెంట్ ఛైర్మన్గా పనిచేశారు. 2014లో ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. భార్య కూడా వైసీపీలో పదవులు పొందారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు జగన్కు పంపిన లేఖలో పేర్కొన్నారు.