News June 2, 2024
విశాఖ: తంతడి బీచ్లో అక్కాచెల్లెళ్లు మృతి

ఉమ్మడి విశాఖ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అచ్యుతాపురం మండలం తంతడి బీచ్లో ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. వారిలో శెట్టిపాలెంకి చెందిన నూకరత్నం, తీడ గ్రామానికి చెందిన కనకదుర్గ(27) మృతిచెందగా.. శిరీష అనే అమ్మాయిని స్థానికులు కాపాడారు. కాగా మృతి చెందిన వారిద్దరూ సొంత అక్కాచెల్లెళ్లుగా గుర్తించారు. శిరీష పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్కి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News November 5, 2025
పోషకాహారాన్ని సకాలంలో అందించాలి: VZM JC

జిల్లాలోని 2,499 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పోషకాహారం సకాలంలో అందేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేథుమాధవన్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. సరుకుల సరఫరాలో జాప్యం లేకుండా, నాణ్యమైన బియ్యం, పప్పు, నూనె అందించాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ డైరెక్టర్ విమల రాణి, సివిల్ సప్లయిస్ డీఎం శాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News November 5, 2025
VZM: పీజీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్

ఏయూ పీజీ పరీక్షలలో ముగ్గురు విద్యార్థులను డిబార్ చేశారు. మంగళవారం ప్రారంభమైన పీజీ పరీక్షల్లో విజయనగరం జిల్లా ఎస్.కోట చైతన్య డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ మూడో సెమిస్టర్ పరీక్షలు రాసిన ముగ్గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కి పాల్పడుతున్నట్లు విశ్వవిద్యాలయంకి వెళ్లిన తనిఖీ బృందం గుర్తించింది. దీంతో ఈ విద్యార్థులను అధికారులు డిబార్ చేశారు. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని ఏ.యూ స్పష్టం చేసింది.
News November 5, 2025
పెట్టుబడులపై అవగాహన కల్పించండి: మంత్రి కొండపల్లి

విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధానాల అమలు, తదితర అంశాలపై అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ దేశాల్లో కీలక స్థానాల్లో ఉన్న తెలుగు ఎన్నారైలతో ప్రత్యేక క్లబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పారిశ్రామిక విధానం వివరించి వారికి పెట్టుబడులపై అవగాహన కల్పించాలని అన్నారు.


