News February 20, 2025

విశాఖ: త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిపై క‌ఠిన‌ చ‌ర్య‌లు

image

గ్రూప్-2 ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని క‌లెక్ట‌ర్ హరేంద్ర ప్రసాద్ హెచ్చ‌రించారు. గురువారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు. మాస్ కాపీయింగ్ లేదా ఇత‌ర సంఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని పేర్కొంటూ ఎలాంటి ఆధారం లేకుండా త‌ప్పుడు వార్త‌ల‌ను, స‌మాచారాన్ని చేరవేసే వారిపై నిఘా ఉంటుంద‌న్నారు. త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

Similar News

News March 22, 2025

రోడ్డు ప్రమాద బాధితులకు రూ.6లక్షల పరిహారం: విశాఖ సీపీ

image

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా బాధితులకు శుక్రవారం రూ.6లక్షల పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్ రన్ ప్రమాదంలో చనిపోయిన మల్లిపాటి సూర్యనారాయణ, పైల సూరిబాబు, కొట్యాడ సూర్యప్రభ కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున రూ.6లక్షలు అకౌంట్‌లలో డిపాజిట్ చేసినట్లు సీపీ తెలిపారు. ఇప్పటి వరకూ 24 మంది బాధితులకు రూ.15 లక్షలు అందించామన్నారు.

News March 21, 2025

విశాఖ అధికారులతో జూమ్ కాన్ఫిరెన్స్

image

విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారులతో రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.సి.డి.సి.డి.సర్వే, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, మాతా, శిశు మరణాల రేటు తగ్గింపు, గర్భిణీల టీ.టీ-1, టీ-టీ-2 డోసులు, జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఆరోగ్య సేవలు మరింత మెరుగుపరచుకోవాలని సూచించారు. DMHO జగదేశ్వరరావు ఉన్నారు.

News March 21, 2025

జీవీఎంసీకి పన్ను చెల్లించిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం

image

విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం జీవీఎంసీకి ఈ ఏడాది పన్నును చెల్లించింది. మార్చి 31వ తేదీకి ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో శుక్రవారం జీవీఎంసీ గాజువాక జోన్ అధికారులకు పన్ను మొత్తం రూ.3,41,47,156 స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెల్లించింది. గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి, అసిస్టెంట్ కమిషనర్ రామ్ నారాయణ, ఆర్‌ఐ శివకు విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులు శుక్రవారం చెక్కు అందజేశారు.

error: Content is protected !!