News March 28, 2024

విశాఖ: తమ్ముడి కోసం అక్క.. భర్తల కోసం భార్యలు

image

ఉమ్మడి విశాఖలోని అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. విశాఖ తూర్పు TDP అభ్యర్థి వెలగపూడి తరఫున ఆయన భార్య సుజన, పశ్చిమ YCP అభ్యర్థి ఆనంద్ కుమార్ తరఫున ఆయన సోదరి రమాకుమారి, అనకాపల్లి YCP అభ్యర్థి మలసాల భరత్ కుమార్‌కు మద్దతుగా ఆయన భార్య ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అటు బీజేపీ MP అభ్యర్థి సీఎం రమేశ్ సోదరుడు సురేశ్, తనయుడు రితీష్‌ అనకాపల్లిలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు.

Similar News

News December 13, 2025

నేడు AU పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం

image

AU పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం ‘వేవ్స్–2025’ను మహిళా సాధికారత థీమ్‌తో శనివారం నిర్వహించనున్నారు. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్, మూర్తి ట్రస్ట్ చైర్‌పర్సన్ సుధా మూర్తి, ఏయూ ఆలుమ్ని వ్యవస్థాపక అధ్యక్షుడు, GMR అధినేత జి.ఎం.రావు తదితరులు పాల్గొననున్నారు.

News December 12, 2025

విశాఖ నుంచి తిరుగుపయనమైన సీఎం

image

ఒకరోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్ర‌బాబు విశాఖకు శుక్రవారం వచ్చారు. విశాఖలో పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమై, పలు కంపెనీలకు మంత్రులు, అధికారులతో శంకుస్థాపన చేపట్టారు. అనంతరం వైజాగ్ ఎకానమిక్ రీజియన్ అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం తిరుగు పయనమయ్యారు. ఆయనకు ఎయిర్ పోర్ట్‌లో కూటమి నాయకులు, అధికారులు ఆత్మీయ వీడ్కోలు ప‌లికారు.

News December 12, 2025

అక్రమ మద్యంపై ఉక్కుపాదం: మంత్రి కొల్లు రవీంద్ర

image

విశాఖలో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర 4 జిల్లాల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అధికారుల ఏడాది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. బెల్ట్ షాపులు, నాటు సారా, కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని అధికారులకు స్పష్టం చేశారు.