News February 1, 2025

విశాఖ: తల్లిని చంపి రూమ్‌‌కి తాళం వేసిన కొడుకు

image

విశాఖలో కన్న కొడుకే తల్లిని <<15319558>>హత్య<<>>చేసిన విషయం తెలిసిందే. ఎవరూ లేని సమయంలో తల్లిపై కత్తితో దాడి చేయగా ఆమె చనిపోయింది. తల్లిని రూమ్‌లో పెట్టి తాళం వేశాడు. ఇంటికి వచ్చిన తమ్ముడు తల్లి గురించి అడగ్గా ఇంట్లో లేదని సమాధానం ఇచ్చాడు. చిన్నకొడుకు తండ్రికి ఫోన్ చేసి చెప్పగా కోస్ట్ గార్డులను ఇంటికి పంపించాడు. వారు వెతకగా అల్కాసింగ్ రక్తపు మడుగులో పడి ఉండడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.

Similar News

News February 1, 2025

ఫిబ్రవరి 5న కలెక్టరేట్ వద్ద ధర్నా: అమర్నాథ్

image

జిల్లాలో ఐదో తేదీ నుంచి వైసీపీ ఆధ్వర్యంలో ఫీజు పోరు నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఫీజుపోరు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

News February 1, 2025

మద్దిలపాలెంలో వ్యభిచార గృహంపై దాడి

image

విశాఖలో ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు MVP పోలీసులు తెలిపారు. మద్దిలపాలెం ఆటోమోటివ్ జంక్షన్‌ సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న ముందస్తు సమాచారంతో MVP పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి శుక్రవారం దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ రైడ్‌లో వ్యభిచార గృహం నడిపిస్తున్న సంతోశ్ కుమార్‌‌, విటుడు పెందుర్తికి చెందిన కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

News February 1, 2025

విశాఖ -పలాస పాసింజర్ రైళ్ల గమ్యం కుదింపు

image

వాల్తేర్ డివిజన్‌లో సాంకేతిక కారణాల వల్ల విశాఖ -పలాస పాసింజర్ రైళ్ల గమ్యం కుదింపు చేసినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-పలాస (67289/90)రైళ్లు ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు శ్రీకాకుళం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పలాసకు బదులుగా శ్రీకాకుళం నుంచి బయలుదేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.