News April 12, 2025
విశాఖ-తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అనకాపల్లి మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖ-తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖలో బయలుదేరుతుందన్నారు. తిరుపతి-విశాఖ స్పెషల్ రైలు ప్రతి గురువారం రాత్రి తిరుపతిలో బయలుదేరుతుందన్నారు. విశాఖ-కర్నూలు స్పెషల్ ప్రతి మంగళవారం రాత్రి 7 గంటలకు విశాఖలో బయలుదేరుతుందని పేర్కొన్నారు.
Similar News
News February 9, 2026
మంగళగిరిలో మేఘాలయ బృందం పర్యటన

‘ఎనీమియా ముక్త్ భారత్’ పరిశీలన ఆంధ్రప్రదేశ్‌లో’ ఎనీమియా ముక్త్ భారత్’ అమలు తీరును పరిశీలించేందుకు మేఘాలయ NHM ఉన్నతాధికారుల బృందం సోమవారం మంగళగిరిలో పర్యటించింది. స్థానిక ఉన్నత పాఠశాల, పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రక్తహీనత నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంలో AP అగ్రస్థానంలో ఉన్నందున క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చామని అధికారులు తెలిపారు. రేపు అంగన్వాడీ, PHCలను ఈ బృందం సందర్శించనుంది.
News February 9, 2026
రాష్ట్రస్థాయిలో కాకినాడ సిటీకి మూడో ర్యాంకు

రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన నియోజకవర్గాల ర్యాంకుల్లో కాకినాడ సిటీ సత్తా చాటింది. వివిధ అంశాల్లో 77 ఇండికేటర్లను పరిగణనలోకి తీసుకోగా, 92 స్కోరుతో రాష్ట్రస్థాయిలో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. A+ కేటగిరీలో నిలవడంపై అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ సిటీగా కాకినాడకు దక్కిన గౌరవంగా దీన్ని పలువురు అభివర్ణిస్తున్నారు.
News February 9, 2026
BREAKING: HYDలోని హాస్టళ్లలో తనిఖీలు

నగరంలోని PG హాస్టళ్లపై ఖాకీ నిఘా మొదలైంది. ‘ఇకపై ఆటలు సాగవు.. నిబంధనలు పాటించాల్సిందే’ అంటూ మియాపూర్ పోలీసులు నిర్వాహకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ట్రేడ్ లైసెన్స్, ఫైర్ ఎన్వోసీ, ఎఫ్ఎస్‌ఎస్ఏఐ సర్టిఫికెట్లు లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్ స్పష్టం చేశారు. ప్రతి హాస్టల్ సెక్టార్ వారీగా రిజిస్టర్లు మెయింటైన్ చేయాలని, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేయాలని ఆదేశించారు.


