News April 5, 2025
విశాఖ తీరంలో అమెరికా యుద్ధ విన్యాసాలు

విశాఖ తీరానికి సైనికులతో ఉన్న అమెరికా దేశ యుద్ధ నౌకలు వచ్చాయి. ఇండో పసిఫిక్ ప్రాంతం భద్రతకు దిక్సూచిగా భారత్- అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయాంఫ్ 2025 విన్యాసాల్లో పాల్గొనడానికి విశాఖ తీరానికి చేరుకున్నాయి. ఈ నెల ఏడో తేదీ వరకు హార్బర్ ఫేజ్‌లో విన్యాసాలు జరుగుతాయి. అమెరికా యుద్ధనౌక యూఎస్ కంస్టాక్, రాల్స్ జాన్సన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
Similar News
News April 7, 2025
NIMSలో సోలార్ కరెంట్‌తో డయాలసిస్ సేవలు..!

HYD NIMS ఆసుపత్రిలో డయాలసిస్ రోగులకు ఇకపై సౌర విద్యుత్తుతో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రాజెక్ట్ గ్రీన్ డయాలసిస్ ఇనిషియేటివ్ పేరుతో రోజుకు 200 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దీని ద్వారా పర్యావరణ హితంగా, నిరాటంకంగా డయాలసిస్ సేవలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
News April 7, 2025
చౌటుప్పల్: ఉరేసుకుని ఒకరి సూసైడ్

వృద్ధుడు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్ మున్సిపాటిటీ తంగడపల్లిలో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన రాములు ఈ నెల 4న పెన్షన్ తీసుకోవడానికి చౌటుప్పల్ నుంచి తంగడపల్లికి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం కొడుకు రాములుకి ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయకపోవడంతో పక్కింటి వారికి సమాచారం అందించాడు. వారు చూడగా ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. కుమారుడు బిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News April 7, 2025
అవనిగడ్డ: పండుగ రోజు విషాదం.. ముగ్గురి మృతి

శ్రీరామ నవమి పండుగ రోజు మోదుమూడిలో ఆనందం కన్నీటిగా మారింది. రాములోరి ఊరేగింపులో భాగంగా కృష్ణా నదిలో రామ స్తూపాన్ని శుద్ధిచేస్తుండగా ముగ్గురు బాలురు నీటమునిగి మృతిచెందిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు అన్నదమ్ముల సంతానం కావడం, ఒకే కుటుంబానికి వారసులుగా ఉండటం గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. వీరబాబు, వెంకట గోపి కిరణ్, వర్ధన్‌లు మృతిచెందిన వారిలో ఉన్నారు.