News October 14, 2024
విశాఖ: త్వరలో తెలుగులో వాతావరణం సమాచారం
వాతావరణ సమాచారాన్ని త్వరలో తెలుగులో అందించనున్నట్లు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం చీఫ్ భారతి తెలిపారు. త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇంగ్లీష్ భాషలోనే వాతావరణం సమాచారాన్ని అందిస్తున్నామన్నారు. ఇకపై ఐఎండీ సూచనలకు అనుగుణంగా ప్రాంతీయ భాష తెలుగులో సమాచారాన్ని అందజేస్తామన్నారు. కైలాసగిరిపై ఏర్పాటుచేసిన డాప్లర్ రాడార్ ఆధునీకరణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు.
Similar News
News January 5, 2025
విశాఖ: నేవీ విన్యాసాలకు హాజరైన ముఖ్యులు వీరే!
విశాఖ తీరం భారత నేవీ విన్యాసాలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ప్రజా ప్రతినిధులు పాల్గొని హెలికాప్టర్లు ఆకృతుల్లో చేపట్టిన విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో మంత్రులు డోలా బాల వీరాంజనేయలు, కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత, అనకాపల్లి MP సీఎం రమేశ్, నగర మేయర్ హరి వెంకటకుమారి, MLA వంశీకృష్ణ శ్రీనివాస్, గొల్ల బాబురావు పాల్గొన్నారు.
News January 4, 2025
ఉమ్మడి విశాఖలో పలువురికి పదోన్నతులు
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నలుగురు ఏ.ఎస్.ఐలను ఎస్ఐలుగా ప్రమోషన్ కల్పిస్తూ విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఏఎస్ఐలుగా పనిచేస్తున్న టి.అర్జునరావు, ఎస్.శేషగిరిరావు, ఎస్.సన్యాసిరావులను అనకాపల్లి జిల్లాకు, జె.శంకరరావును అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఎస్ఐలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News January 4, 2025
స్టీల్ ప్లాంట్: మోసానికి పాల్పడిన తండ్రి-కొడుకులకు జైలు శిక్ష
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో తండ్రి-కొడుకులకు న్యాయమూర్తి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ విశ్రాంత ఉద్యోగి పోతయ్య ఆయన కుమారుడు వెంకటరమణ ఉద్యోగాలు ఇప్పిస్తామని 50 మంది నుంచి రూ.63 లక్షలు వసూలు చేశారు. బాధితులు 2017లో స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.