News October 3, 2024

విశాఖ: దసరాకు ప్రత్యేక బస్ సర్వీసులు

image

దసరా సందర్భంగా విశాఖ నుంచి పలు ప్రాంతాలకు 250 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలరాజు తెలిపారు. ప్రత్యేక సర్వీసులకు ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవన్నారు. హైదరాబాద్‌కు 40, విజయవాడకు 40 నుంచి 50, రాజమండ్రి, కాకినాడ సెక్టార్‌కు 40 అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక సర్వీసులు నడుపుతామన్నారు.

Similar News

News October 7, 2024

ఆరిలోవ: పసికందు అదృశ్యం.. కేసు ఛేదించిన పోలీసులు

image

ఆరిలోవ రామకృష్ణాపురంలో పసికందు అదృశ్యం ఘటనను ఆరిలోవ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు ఆరిలోవ సీఐ గోవిందరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల వలన పసికందు అమ్మమ్మ వాళ్ల బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. కాగా ఆదివారం అర్ధరాత్రి నుంచి గ్రామంలో పసికందును కుక్క లాక్కుని పోయిందని జరిగిన హై డ్రామాకు తెరపడింది.

News October 7, 2024

విశాఖ: ‘ఎమ్మెల్సీ సీటును తూర్పు కాపులకు కేటాయించాలి’

image

టీచర్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా బీసీ తూర్పు కాపులకు కేటాయించాలని ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంఘం అధ్యక్షులు గొర్లె శ్రీనివాస్ నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ పార్టీ అయితే తూర్పు కాపులకు సీటు ఇస్తుందో ఆ పార్టీకి పూర్తి మద్దతు తెలియజేస్తామని అన్నారు. ఈ సమావేశంలో తూర్పు కాపు సంఘం నాయకులు బలగ సుధాకర్, లోగిస గణేశ్ పాల్గొన్నారు.

News October 7, 2024

విశాఖలో ఆస్తి కోసం హత్య

image

మల్కాపురంలో ఈనెల 3న జరిగిన వాసు హత్య కేసు వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించారు. ఈ కేసులో నిందితుడు పవన్ సాయిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ విద్యాసాగర్ తెలిపారు. ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల నేపథ్యంలో హత్య జరిగినట్లు గుర్తించామన్నారు. వాసు అన్న సింహాచలం మొదటి భార్య కుమారుడు పవన్ సాయిని పిలిపించి దాడి చేశారని సీఐ తెలిపారు.