News April 11, 2025

విశాఖ: దారి దోపిడీ చేసిన మైనర్‌ను పట్టుకున్న పోలీసులు

image

విశాఖలో దారి దోపిడీ చేసిన 17 ఏళ్ల మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు క్రైమ్ డీసీపీ లతా మాధురి శుక్రవారం తెలిపారు. ఈనెల 10న స్టీల్‌ప్లాంట్ పరిధిలో ఓ మైనర్‌ ర్యాపిడో రైడ్ బుక్ చేశాడు. తుమ్మగంటి కిషోర్ ఆ రైడ్ పిక్ చేసుకొని మైనర్‌‌ను తీసుకెళ్తుండగా నిర్మానుష ప్రదేశంలో వాహనం ఆపి డ్రైవర్‌ను కొట్టి రూ.48,100 లాక్కున్నాడు. కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీపీ ఆదేశాల మేరకు ఆ మైనర్‌‌ను అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News December 11, 2025

రాత్రికి విశాఖ చేరుకోనున్నమంత్రి లోకేశ్

image

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం రాత్రి విశాఖ చేరుకోనున్నారు. రాత్రి 9 గంటలకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్తారు. డిసెంబరు 12న శుక్రవారం మధురవాడ ఐటీ హిల్స్‌లో పలు ఐటీ సంస్థల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కాపులుప్పాడలో జరిగే కాగ్నిజెంట్ కంపెనీ భూమి పూజ కార్యక్రమానికి హాజరవుతారు.

News December 11, 2025

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్

image

సీఎం చంద్రబాబు రేపు కపులుప్పాడలో కాగ్నిజెంట్ సహా ఐటీ పరిశ్రమల శంకుస్థాపనకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం భీమిలి–కపులుప్పాడ ప్రాంతాల్లో ఏర్పాట్లు పరిశీలించారు. రోడ్లు, భద్రత, పార్కింగ్ వంటి ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేశారు. సీఎం పర్యటనలో లోపాలేమీ లేకుండా పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

News December 11, 2025

విశాఖ వేదికగా పెన్షన్ అదాలత్

image

విశాఖపట్నంలో డిసెంబర్ 19న ‘పెన్షన్ అదాలత్’ కార్యక్రమం జరగనుంది. సిరిపురం వుడా చిల్డ్రన్స్ థియేటర్‌లో జరిగే ఈ సదస్సుకు ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శ్రీమతి ఎస్.శాంతి ప్రియ హాజరవుతారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం, డీడీవోలకు సరైన మార్గనిర్దేశం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఉద్యోగులు, పెన్షనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.