News December 5, 2024
విశాఖ: ‘దీపం -2 పథకంపై మరింత ఫోకస్ పెట్టాలి’

దీపం-2 పథకంపై అధికారులు మరింత ఫోకస్ పెట్టాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గురువారం విశాఖ కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో సమావేశామయ్యారు. గ్యాస్ బుకింగ్, డెలివరీ ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలన్నారు. గ్యాస్ డెలివరీ సమయంలో, E-KYC సమయంలో ప్రజల నుంచి నగదు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. అలా చేస్తే సంబంధిత గ్యాస్ ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు.
Similar News
News December 7, 2025
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు 279 మంది హాజరు

విశాఖలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష ఆదివారం జరిగింది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. 349 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 279 మంది హాజరయ్యారని డైరెక్టర్ కె.రాజేశ్వరి తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు. ఎంపికైన వారికి సివిల్స్ పరీక్షకు శిక్షణ ఇస్తామన్నారు.
News December 7, 2025
విశాఖ: ప్రభుత్వ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్

విశాఖ సీపీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు సీపీ శంక బ్రత బాగ్చి తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. GVMC ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్ కార్యలయంలో ఉదయం వినతులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.