News February 10, 2025

విశాఖ: నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు ఈరోజు ఆఖరి రోజు కాగా ఇప్పటివరకు 8మంది నామపత్రాలు సమర్పించారు. సోమవారం ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల పరిశీలన ఈనెల 11న చేస్తారు. 13 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

Similar News

News October 30, 2025

విశాఖలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కారణమిదే

image

భవనం నిర్మించుకుంటే డబ్బులు ఇవ్వాలంటూ ముగ్గురు బెదిరిస్తున్నారని మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. రాంజీ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్ తన ఇంటిపై అదనపు అంతస్తు నిర్మిస్తుండగా ఇదే ప్రాంతానికి చెందిన నర్సింగరావు, అరుణ్ బాబు, శంకర్రావు బెదిరించడం వల్లే తాను అత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రసాద్ సెల్ఫీ వీడియోలో చెప్పాడు. దీంతో కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 30, 2025

విశాఖలో బెండకాయలు రూ.54

image

విశాఖ రైతు బజార్‌లలో కూరగాయల ధరలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు గురువారం విడుదల చేశారు. వాటి వివరాలు (రూ.కిలో) టమాటా రూ.30, ఉల్లిపాయలు రూ.20/22, వంకాయలు రూ.40/44/54, బెండకాయ రూ.54, మిర్చి రూ.40, కాకరకాయ రూ.36, అనపకాయ రూ.26, క్యాబేజీ రూ.24, దొండ రూ.42, బీన్స్ రూ.66, పోటల్స్ రూ.62, చిలకడ రూ.30, కంద రూ.52, బద్ద చిక్కుడు రూ.66, తీపిగుమ్మిడి రూ.30, కరివేపాకు రూ.50, బీరకాయ రూ.46గా ఉన్నాయి.

News October 30, 2025

‘83 పునరావాస కేంద్రాల్లో 1516 మందికి ఆశ్రయం’

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 83 పునరాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో 1,516 మంది ఆశ్రయం పొందారు. ములగాడ మండలంలో 7 పునరావాస కేంద్రాల్లో 782 మంది ఆశ్రయం పొందారు. మహారాణిపేటలో 7 పునరావాస కేంద్రాల్లో అత్యధికంగా 520 మంది ఆశ్రయం పొందారు. సీతమ్మధార మండలంలోని 7 పునరావస కేంద్రాల్లో 82 మందికి ఆశ్రయం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.