News December 27, 2024
విశాఖ: ‘నాలుగు రోజులు బ్యాంకు సేవలు నిలిపివేత’
భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు ఏపీజీవీబీ ఆంధ్రా, తెలంగాణ విభాగాల విభజన దృష్ట్యా నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలను నిలిపివేస్తున్నట్లు ఏపీజీవీబీ రీజనల్ మేనేజర్ ఎస్.సతీశ్ చంద్ర తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఖాతాదారులు సహకరించాలని కోరారు. జనవరి ఒకటి నుంచి బ్యాంకు సేవలు యథాతథంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Similar News
News December 29, 2024
పాడేరు: గిరిజన విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్
కలెక్టర్ దినేశ్ కుమార్ శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో గిరిజన విద్యార్థులతో ముచ్చటించారు. శ్రీకృష్ణాపురం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల బాలికలు, దిగు మొదాపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో భేటీ అయ్యారు. విద్యార్థుల కుటుంబ నేపథ్యాలు, పరిస్థితులు, తల్లిదండ్రులు వృత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
News December 28, 2024
విశాఖ: బీచ్లో ప్రారంభమైన నేవీ రిహార్సల్స్
విశాఖ నగరంలో వచ్చే నెల నాలుగవ తేదీన నేవీ డే సందర్భాన్ని పురస్కరించుకుని బీచ్లో శనివారం సాయంత్రం నేవీ రిహార్సల్స్ ప్రారంభం అయ్యాయి. నేవీ అధికారులు, సిబ్బంది అద్భుత విన్యాసాలు ప్రదర్శించారు. ఒకేసారి మూడు హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నగరంలో ప్రజలు విన్యాసాలను తిలకించారు. వచ్చే నెల 3వ తేదీ వరకు రిహార్సల్స్ కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
News December 28, 2024
విశాఖ: ‘మరింత సమర్థవంతంగా పనిచేయాలి’
పోలీస్ అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేస్తూ ముందుకు వెళ్లాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ సూచించారు. వుడా చిల్డ్రన్ ఎరీనాలో శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గిరిధర్, నేవీ అధికారులతో కలిసి నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే ఏడాది చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. గిరిధర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీస్ శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.