News November 27, 2024
విశాఖ: ‘నా భర్తపై 20 కేసులు పెట్టారు’
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్‌పై 20 కేసులు పెట్టారని ఆయన భార్య ఇంటూరి సృజన అన్నారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. తన భర్తను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారన్నారు. ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వడం లేదని చెప్పారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేదు, స్టంట్ వేశారని విశ్రాంతి అవసరమని చెప్పినా వినడం లేదన్నారు. సోషల్ మీడియాలో ఏ పోస్టులు పెట్టారో స్పష్టం చేయాలన్నారు.
Similar News
News December 2, 2024
మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు టైలర్స్ వినతి
విశాఖ జిల్లా టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ఆదివారం విశాఖలో కలిశారు. ఈ సందర్బంగా టైలర్స్ సమస్యలపై వినతి పత్రం అందజేసారు. టైలర్స్ కు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని కోరారు.ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 50 సంవత్సరాలు దాటిన టైలర్స్‌కి పెన్షన్ ఇవ్వాలని కోరారు. విశాఖ జిల్లా అధ్యక్షులు కూనూరు మళ్ళికేశ్వరరావు, టైలర్స్ పాల్గొన్నారు.
News December 1, 2024
దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్‌కు విశాఖ జట్టు ఎంపిక
గాజువాక జింక్ మైదానంలో ఈనెల 9 నుంచి 11 వరకు నిర్వహించే దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్‌కు విశాఖ జిల్లా జట్టును ఆదివారం ఎంపిక చేసినట్లు నిర్వాహకులు మణికంఠ, హేమ సుందర్ తెలిపారు. మొట్టమొదటిసారిగా జరిగే దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంటులో 10 జిల్లాల నుంచి పది టీములు పాల్గొంటున్నట్లు వెల్లడించారు.
News December 1, 2024
విశాఖలో వర్షం.. మ్యాచ్ రద్దు
విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరగాల్సిన ఛత్తీస్‌గఢ్, ఒడిశా మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు చేశారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా మధ్యాహ్నం 2 రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత కొన్ని రోజులుగా విశాఖలో మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే.