News February 3, 2025

విశాఖ: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ 

image

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైమ్ అండ్ షిప్పింగ్ విశాఖ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉపాధి ఇవ్వనున్నట్లు కమాండర్ గోపి కృష్ణ సోమవారం తెలిపారు. 10th, ఇంటర్, డిగ్రీ, ఐ.టి.ఐ చదివిన వారు అర్హులన్నారు. వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, CNC ప్రోగ్రామర్, ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల వారు సింధియా జుంక్షన్ CEMS కేంద్రంలో FEB 10వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

Similar News

News October 25, 2025

విశాఖలో సెలవులు రద్దు: కలెక్టర్

image

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాబోయే 72 గంటలు అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు, పెనుగాలుల ప్రమాదం ఉన్నందున అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.

News October 25, 2025

మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ వద్ద మృతదేహం కలకలం

image

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. రిజర్వాయర్ చేసే గేటు వద్ద తేలుతూ కనిపించిన మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పెందుర్తి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News October 25, 2025

విశాఖలో సీఐల బదిలీ: సీపీ

image

విశాఖలో 8మంది CIలను బదిలీ చేస్తూ CP శంఖబ్రత బాగ్చీ ఉత్తర్వులు జారీ చేశారు. 1టౌన్ సీఐ జీడి బాబును ఎయిర్ పోర్టు ప్రోటోకాల్‌కు, సీసీఎస్‌లో ఉన్న సీఐ శంకర్‌నారాయణను ఎయిర్ పోర్టు స్టేషన్‌కు, అక్కడ పనిచేస్తున్న ఉమామహేశ్వరరావును సిటీ వీఆర్‌కు, రేంజ్‌లో ఉన్న వరప్రసాద్‌ను వన్‌టౌన్ స్టేషన్‌కు, సీపోర్టు ఇమిగ్రేషన్‌లో ఉన్న శ్రీనివాసరావును వీఆర్‌కు, సిటీ వీఆర్‌లో ఉన్న రామకృష్ణ స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు.