News February 25, 2025
విశాఖ: ‘నిర్ణీత సమయంలో ధ్రువపత్రాలు అందించాలి’

జనన, మరణ, కుల, వివాహ, ఆదాయ ధ్రువపత్రాలను నిర్ణీత సమయంలో అందించాలని జిల్లా న్యాయాధికారి సంస్థ సెక్రటరీ వెంకట శేషమ్మ పేర్కొన్నారు. జీవీఎంసీ జోన్ -4 కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. సర్టిఫికెట్లు జారీ విషయంలో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యంతో 6 నెలలకు ఒకసారి సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. మ్యారేజ్ ధృవపత్రాలు జారీ చేసేటప్పుడు వధూవరుల వయసు పరిగణలోకి తీసుకోవాలన్నారు.
Similar News
News February 26, 2025
విశాఖ: గాయపడిన యువకుడి మృతి

విశాఖలో 22 ఏళ్ల యువకుడు చనిపోయాడు. మల్కాపురానికి చెందిన సిద్ధు శ్రీహరిపురం వద్ద సోమవారం రాత్రి పార్కింగ్ చేసిన బైకు తీస్తుండగా కిందపడి గాయపడ్డాడు. ప్రాథమిక చికిత్స తర్వాత ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం అస్వస్థతకు గురికావడంతో KGHకు తరలించారు. అక్కడ అతను చనిపోయినట్లు మల్కాపురం సీఐ విద్యాసాగర్ తెలిపారు. మృతుడి సోదరుడు నవీన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
News February 26, 2025
బీచ్ రోడ్డులో కోటి లింగాలకు అభిషేకం

విశాఖ సాగర తీరంలో నేడు అద్భుత ఘటన జరగనుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా కోటి శివలింగాలకు అభిషేకం చేయనున్నారు. ప్రయాగరాజ్ మహాకుంభ మేళా నుంచి తెచ్చిన జలాలతో ఇలా చేయడం మరొక విశేషం. బీచ్ రోడ్డులో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ అద్భుత దృశ్యాలను కళ్లారా చూడండి. మిస్ కాకండి.
News February 26, 2025
విశాఖలో దారి దోపిడీ ముఠా అరెస్ట్

విశాఖలో దారి దోపిడీ ముఠాను త్రీటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఫిషింగ్ హార్బర్ వద్ద ఫిబ్రవరి 22న ఉదయం మైలపల్లి చందర్రావు అనే వ్యక్తిని ముగ్గురు బైక్పై వచ్చి అడ్డుకున్నారు. అతని నుంచి రూ.350 నగదు, సెల్ ఫోన్ తీసుకొని తోసేసి వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గాలించారు. నిందితులు తీడా మోనేష్ బాబు(19), మరో ఇద్దరు మైనర్ యువకుల(17)ను అరెస్ట్ చేసి జువెనైల్ హోం, రిమాండ్కు తరలించారు.