News February 25, 2025

విశాఖ: ‘నిర్ణీత సమయంలో ధ్రువపత్రాలు అందించాలి’

image

జనన, మరణ, కుల, వివాహ, ఆదాయ ధ్రువపత్రాలను నిర్ణీత సమయంలో అందించాలని జిల్లా న్యాయాధికారి సంస్థ సెక్రటరీ వెంకట శేషమ్మ పేర్కొన్నారు. జీవీఎంసీ జోన్ -4 కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. సర్టిఫికెట్లు జారీ విషయంలో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యంతో 6 నెలలకు ఒకసారి సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. మ్యారేజ్ ధృవపత్రాలు జారీ చేసేటప్పుడు వధూవరుల వయసు పరిగణలోకి తీసుకోవాలన్నారు.

Similar News

News July 11, 2025

విశాఖలో మెట్రోకు సెప్టెంబర్‌లో శంకుస్థాపన: గండి బాబ్జి

image

విశాఖలో మెట్రోకు సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేపట్టనున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి వెల్లడించారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఉమ్మడి విశాఖలోని సుమారు 300 గ్రామాల్లో గంజాయి సాగును నిర్మూలించి ఉద్యానవనాల పెంపునకు కృషి చేస్తున్నామన్నారు.

News July 11, 2025

విశాఖలో ఈసాయ్ సంస్థ విస్తరణ

image

విశాఖపట్నంలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఈసాయ్ ఫార్మాస్యూటికల్స్ నిర్ణయించింది. 2026 ఫిబ్రవరి నాటికి ఈ కేంద్రం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇప్పటికే జేఎన్ ఫార్మా సిటీలో తయారీ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న ఈసాయ్ సంస్థ ఈ కొత్త కేంద్రంతో భారత్‌లో తన ఉనికిని మరింతగా బలోపేతం చేయనుంది.

News July 11, 2025

షీలానగర్‌లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

షీలానగర్ సమీపంలోని మారుతి సర్కిల్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పరవాడకు చెందిన అశోక్ రెడ్డి బైకుపై వెళుతుండగా ట్రాలర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎయిర్ పోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గతంలో కూడా ఇదే ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు.