News September 7, 2024
విశాఖ నుంచి కొత్తగా 4 విమాన సర్వీసులు

విశాఖ విమానాశ్రయం నుంచి కొత్తగా మరో 4 ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం సర్వీసులను నడపనుంది. సెప్టెంబర్ 21న విశాఖ హైదరాబాద్ సర్వీస్ ప్రారంభం కానుంది. తర్వాత అక్టోబర్ 27న విశాఖ విజయవాడ సర్వీస్‌ను ప్రారంభించనున్నారు. అదేరోజు విశాఖ హైదరాబాద్ సర్వీస్ కూడా ప్రారంభిస్తారు. అలాగే విశాఖ అహ్మదాబాద్ కు వారానికి మూడు రోజుల కొత్త సర్వీసులు నడపనున్నట్లు ఏపీ ఏటీఏ ఇన్‌ఛార్జులు కుమార్ రాజా, డీఎస్ వర్మ తెలిపారు.
Similar News
News December 13, 2025
నేడు AU పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం

AU పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం ‘వేవ్స్–2025’ను మహిళా సాధికారత థీమ్‌తో శనివారం నిర్వహించనున్నారు. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్, మూర్తి ట్రస్ట్ చైర్పర్సన్ సుధా మూర్తి, ఏయూ ఆలుమ్ని వ్యవస్థాపక అధ్యక్షుడు, GMR అధినేత జి.ఎం.రావు తదితరులు పాల్గొననున్నారు.
News December 12, 2025
విశాఖ నుంచి తిరుగుపయనమైన సీఎం

ఒకరోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు విశాఖకు శుక్రవారం వచ్చారు. విశాఖలో పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమై, పలు కంపెనీలకు మంత్రులు, అధికారులతో శంకుస్థాపన చేపట్టారు. అనంతరం వైజాగ్ ఎకానమిక్ రీజియన్ అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం తిరుగు పయనమయ్యారు. ఆయనకు ఎయిర్ పోర్ట్‌లో కూటమి నాయకులు, అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు.
News December 12, 2025
అక్రమ మద్యంపై ఉక్కుపాదం: మంత్రి కొల్లు రవీంద్ర

విశాఖలో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర 4 జిల్లాల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అధికారుల ఏడాది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. బెల్ట్ షాపులు, నాటు సారా, కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని అధికారులకు స్పష్టం చేశారు.


