News April 5, 2025
విశాఖ నుంచి బయలుదేరే రైళ్లకు గమ్యం కుదింపు

విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లకు బచేలి కిరండోల్ సెక్షన్లో ట్రాక్ నిర్వహణ పనుల నిమిత్తం గమ్యం కుదించినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. విశాఖ – కిరండోల్ పాసెంజర్(58501/02),విశాఖ-కిరండోల్ నైట్ ఎక్స్ ప్రెస్(18515/16) ఏప్రిల్ 5 నుంచి 14వరకు దంతేవాడ వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో కిరండోల్‌కు బదులుగా దంతేవాడ నుంచి బయలుదేరుతుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
Similar News
News April 8, 2025
రైతు బజార్లో తగ్గింపు ధరలో బియ్యం, కందిపప్పు

విశాఖలో బియ్యం, కందిపప్పు ట్రేడర్స్, టోకు వ్యాపారాలతో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ మంగళవారం ధరలపై సమీక్ష చేశారు. బహిరంగ మార్కెట్లో వీటి ధర ఎక్కువగా ఉందని రైతు బజార్లో తక్కువ రేటుకే ఇవ్వనున్నట్లు తెలిపారు. విశాఖలో గాజువాక, ములగాడ, ఎంవీపీ, కంచరపాలెం, మధురవాడ, పెద్ద వాల్తేర్ రైతు బజార్లలో కందిపప్పు కేజీ రూ.104, రా రైస్ కేజీ రూ.44, స్టీమేడ్ రైస్ కేజీ రూ.45కు అమ్మనున్నట్లు తెలిపారు.
News April 8, 2025
ఆదివారం కూడా పన్ను చెల్లించవచ్చు: కలెక్టర్

జీవీఎంసీ పరిధిలో ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఏప్రిల్ 30వ తేదీ లోపు ఏడాది పన్ను అంతా చెల్లించి 5 శాతం రాయితీ పొందవచ్చని GVMC ఇన్ఛార్జ్ కమిషనర్ హరేంధీర ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ నెలలో ఆదివారం కూడా పన్ను చెల్లించవచ్చు అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోనల్ కార్యాలయాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 8 వరకు ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంటాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 8, 2025
విశాఖలో ఈ ఏరియాలకు రిపోర్టర్లు కావలెను

విశాఖ నగరంలోని కొమ్మాది, జగదాంబ జంక్షన్, కేజీహెచ్, పోర్ట్ ఏరియా, పద్మనాభం, ఎండాడ, కైలాసగిరి, గాజువాక ఏరియాల్లో వే2న్యూస్‌లో పని చేసేందుకు రిపోర్టర్లు కావలెను. పబ్లిష్ అయిన ప్రతి వార్తకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింక్‌పై <