News April 6, 2025

విశాఖ నుంచి రోడ్డు మార్గంలో అల్లూరి జిల్లాకు

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండురోజుల పర్యటన నిమిత్తం సోమవారం విశాఖ రానున్నారు. సోమవారం తెల్లవారి 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన అల్లూరి జిల్లా వెళ్తారు. అక్కడ కొన్ని శంకుస్థాపనలు చేసి అరకులో బస చేస్తారు. మంగళవారం అరకు నుంచి విశాఖ వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంగళవారం విశాఖలో బస చేయనున్నట్టు డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.

Similar News

News November 4, 2025

విశాఖలో టుడే టాప్ న్యూస్

image

➤ విశాఖలో పలు చోట్ల కంపించిన భూమి
➤ భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్లను పరిశీలించిన క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్
➤ మార్గశిర మాసోత్సవాల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష
➤ కంచరపాలెంలో నవంబర్ 7న జాబ్ మేళా
➤ శ్రీకాకుళం నుంచి చర్లపల్లికి రైళ్లు: కేంద్ర మంత్రి
➤ కార్తీక పౌర్ణమి బీచ్ స్నానాలపై మెరైన్ పోలీసులు విజ్ఞప్తి
➤ విశాఖలో బహిరంగ మద్యపానంపై డ్రోన్‌తో నిఘా

News November 4, 2025

కేజీహెచ్‌లో హీమోడయాలసిస్ యంత్రాల ఏర్పాటు

image

కేజీహెచ్‌లోని ఎస్ఎస్ బ్లాక్‌‌ నెఫ్రాలజీ వార్డులో 9 హీమోడయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఓ కంపెనీ CSR నిధుల నుంచి రూ.2 కోట్లతో ఈ యంత్రాలను కేజీహెచ్‌కు అందించింది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేల చేతుల మీదుగా బుధవారం నుంచి వీటిని అందుబాటులోకి తేనున్నారు.

News November 4, 2025

కంచరపాలెంలో 7న జాబ్ మేళా

image

కంచరపాలెంలో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 7న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 7 కంపెనీలు పాల్గొనున్నాయి. టెన్త్,ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివిన 18 నుంచి 33 సంవత్సరాలలోపు యువతీ, యువకులు అర్హులు. ఆసక్తి కలవారు https://www.ncs.gov.in, https://employment.ap.gov.in లో వివరాలు నమోదు చేసుకొని నవంబర్ 7న ఉదయం 10 గంటలకు ధ్రువపత్రాలతో హాజరు కావాలి.