News August 22, 2024

విశాఖ నుంచి విజయవాడకు సీఎం తిరుగు ప్రయాణం

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ, అనకాపల్లి జిల్లాల పర్యటన ముగించుకుని గురువారం రాత్రి విజయవాడకు బయలుదేరారు. బుధవారం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో క్షతగాత్రులను ఆయన విశాఖలో పరామర్శించారు. అనంతరం రాంబిల్లి మండలంలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అధికారులతో సమీక్ష అనంతరం గురువారం సాయంత్రం విజయవాడకు ప్రయాణమయ్యారు.

Similar News

News October 21, 2025

పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి: మేయర్

image

అంతర్జాతీయ కార్యక్రమాలకు విశాఖను సుందరీకరించండని మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. కార్మికుల హాజరును పరిశీలించి, వారి వేతనాలను సకాలంలో చెల్లించాలన్నారు. బీచ్ రోడ్డులో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ఎక్కువ మంది కార్మికులను నియమించాలని, గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బీచ్‌లో అదనంగా టాయిలెట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

News October 21, 2025

వ్యాపారులు డస్ట్ బిన్‌లు ఉపయోగించాలి: జీవీఎంసీ కమిషనర్

image

వ్యాపారులు దుకాణాల ముందు డస్ట్ బిన్లు ఉపయోగించాలని, లేనియెడల వారి లైసెన్సులు రద్దు చేస్తామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ హెచ్చరించారు. మంగళవారం ఆరిలోవలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మాంసం, పూల వ్యాపారులు వ్యర్థాలను రోడ్లపై వేయడంతో వారిచేత క్లీన్ చేయించారు. టిఫిన్ సెంటర్ వద్ద డస్ట్ బిన్ లేకపోవడంతో రూ.1000 అపరాధ రుసుమును వసూలు చేయాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌‌ను ఆదేశించారు.

News October 21, 2025

సింహాచలం దేవస్థానం ఇన్‌ఛార్జ్ ఈవోగా సుజాత

image

సింహాచలం దేవస్థానం ఇన్‌ఛార్జ్ ఈవోగా ప్రస్తుతం జోనల్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సుజాతకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ ఈవోగా వ్యవహరిస్తున్న త్రినాథరావు రిలీవ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులును ప్రభుత్వం జారీ చేసింది.