News March 20, 2025
విశాఖ నుంచి వెళ్లే రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు

సామర్లకోట-రావికంపాడు మధ్యన ఆటో మేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించి నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా సింహాద్రి, ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 23,24 తేదీల్లో గుంటూరు – విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ అదే విధంగా విశాఖ – గుంటూరు సింహాద్రి, 24న ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ను రెండు వైపులా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News March 28, 2025
విశాఖలో ఉగాది వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు: జేసీ

ఉగాది వేడుకలను సంప్రదాయబద్దంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని విశాఖ జేసీ మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉగాది వేడుకల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 30న ఉడా చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడే విధంగా నిర్వహించాలన్నారు. వేడుకలు అన్ని శాఖల సమన్వయంతో జరగాలన్నారు.
News March 28, 2025
ఏప్రిల్ 1న పదో తరగతి సోషల్ పరీక్ష: విశాఖ డీఈవో

రంజాన్ మార్చి 31న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఈవో ప్రేమ్ కుమార్ శుక్రవారం తెలిపారు. అయితే పదో తరగతి సోషల్ పరీక్ష మార్చి 31వ తేదీన నిర్వహించనున్నట్లు ముందు హల్ టికెట్స్‌లో ప్రచురితం చేశారని, రంజాన్ పండుగ కావడంతో ఏప్రిల్ 1న పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలన్నారు.
News March 28, 2025
విశాఖ: ‘పోటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్’ విడుదల

విశాఖ జిల్లా అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూ.23,870.62 కోట్లతో క్రెడిట్ ప్లాన్ రూపొందించినట్లు నాబార్డ్ డెవలప్‌మెంట్ మేనేజర్ బసంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో నాబార్డ్ 2025-26 ‘పోటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్’ను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ విడుదల చేశారు. ఈ ప్రణాళిక ముఖ్యంగా MSMEలు, పునరుత్పాదక ఇంధనం, ఎగుమతి క్రెడిట్ సుస్థిర వ్యవసాయంపై దృష్టి సారించిందని పేర్కొన్నారు.