News March 20, 2025

విశాఖ నుంచి వెళ్లే రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు

image

సామర్లకోట-రావికంపాడు మధ్యన ఆటో మేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించి నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా సింహాద్రి, ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 23,24 తేదీల్లో గుంటూరు – విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ అదే విధంగా విశాఖ – గుంటూరు సింహాద్రి, 24న ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ను రెండు వైపులా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News April 18, 2025

మేయర్ అవిశ్వాస తీర్మానం పారదర్శకంగా జరగాలి: అమర్నాథ్

image

జీవీఎంసీ మేయర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం పారదర్శకంగా జరగాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ మేరకు గురువారం విశాఖ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఏప్రిల్ 19న జీవీఎంసీలో నిర్వహించబోయే అవిశ్వాస తీర్మానంపై కార్పొరేటర్లపై బలవంతపు ఒత్తిళ్లు ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని అధికారులు గమనించి పారదర్శకంగా చేపట్టాలని వినతిలో పేర్కొన్నట్లు తెలిపారు.

News April 17, 2025

విశాఖలో టుడే టాప్ న్యూస్

image

➤ జనసేనలో చేరిన ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు ➤వైసీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ కుమార్తె లక్ష్మీ ప్రియాంక➤కలెక్టరేట్లో దిశా మీటింగ్ నిర్వహించిన ఎంపీ భరత్ ➤ఈ నెల 24 నుంచి సింహాద్రి అప్పన్న చందనం అరగదీత ➤పలు హాస్టల్లో తనిఖీలు చేసిన మంత్రి డోలా ➤ POCSO చట్టంపై అవగాహన కల్పించిన హోంమంత్రి ➤ APR 30 వరకు పన్ను వడ్డీపై 50% రాయితీ ➤దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రోగ్రాంకు అనుమతి ఇచ్చిన పోలీసులు

News April 17, 2025

వైసీపీకి ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక రాజీనామా

image

జీవీఎంసీ 6వ వార్డు కార్పొరేటర్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక YCPకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీకి రాజీనామా చేస్తున్నానని అధినేత జగన్‌కు లేఖ పంపారు. అయితే ఆమె ఏ పార్టీలో చేరనున్నది అనేది తెలపలేదు. కాగా ఇవాళ ముగ్గురు YCP కార్పొరేటర్లు జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల 19న మేయర్‌పై అవిశ్వాసం పెట్టనున్న నేపథ్యంలో నంబర్ గేమ్ ఉత్కంఠగా మారింది.

error: Content is protected !!