News February 22, 2025
విశాఖ నుంచి శ్రీశైలంకు అదనంగా బస్సులు

శివరాత్రి సందర్భంగా విశాఖ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్రస్తుతం తిరుగుతున్న బస్సునకు అదనంగా బస్సులు నడపనున్నట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు శనివారం తెలిపారు. ఫిబ్రవరి 25న విశాఖ నుంచి శ్రీశైలంకు మధ్యాహ్నం 2గంటలకు సూపర్ లగ్జరీ బస్సును సాధారణ బస్సు చార్జితో (రూ.1230/- లు) ద్వారకా బస్సు స్టేషన్ నుంచి నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News February 23, 2025
విశాఖలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ -2 మెయిన్ పరీక్ష

విశాఖలో గ్రూప్ -2 మెయిన్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలకు మొత్తం విశాఖలో 16 కేంద్రాల్లో 11,030 మంది అభ్యర్థులు హాజరు అవ్వాల్సి ఉండగా అందులో ఉదయం పరీక్షకు 9,391 మంది హాజరయ్యారు. 1639 మంది గైర్హాజరు అయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 11,030 మంది అభ్యర్థులు హాజరు అవ్వాల్సి ఉండగా అందులో 9370 మంది హాజరయ్యారు. 1660 మంది రాలేదని అధికారులు తెలిపారు.
News February 23, 2025
విశాఖలో కేంద్ర బడ్జెట్పై సమీక్ష

విశాఖలో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ 2025-26పై ఆదివారం మేధావుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా 2025-26 బడ్జెట్ ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా దేశ ప్రయోజనాలకే బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారని, విద్య, వైద్యంకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్లో రైతులకు పెద్ద పీట వేశారన్నారు. MLA విష్ణు కుమార్ రాజు ఉన్నారు.
News February 23, 2025
విశాఖ: లోకల్బాయ్ నానికి రిమాండ్..!

సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి హెచ్చరించారు. విశాఖకు చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై అందిన ఫిర్యాదుల మేరకు అరెస్టు చేసినట్లు ఆదివారం ధ్రువీకరించారు. మెజిస్ట్రేట్ ముందు నానిని హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన మరికొందరిని గుర్తించామని.. వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు.