News February 22, 2025
విశాఖ నుంచి శ్రీశైలంకు అదనంగా బస్సులు

శివరాత్రి సందర్భంగా విశాఖ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్రస్తుతం తిరుగుతున్న బస్సునకు అదనంగా బస్సులు నడపనున్నట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు శనివారం తెలిపారు. ఫిబ్రవరి 25న విశాఖ నుంచి శ్రీశైలంకు మధ్యాహ్నం 2గంటలకు సూపర్ లగ్జరీ బస్సును సాధారణ బస్సు చార్జితో (రూ.1230/- లు) ద్వారకా బస్సు స్టేషన్ నుంచి నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News March 25, 2025
విశాఖ: 30 మంది అనాథ చిన్నారులకు మ్యాచ్ చూసే అవకాశం

వైజాగ్ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరగనున్న మ్యాచ్‌ను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ 30 మంది అనాథ చిన్నారులకు చూసే అవకాశం కల్పించింది. సొంత నిధులతో 30 టికెట్స్ కొని వైజాగ్‌లోని పాపా హోమ్ అనాథ శరణాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు చిన్నారులు స్టేడియంకు వచ్చారు.
News March 24, 2025
విశాఖ: IPL మ్యాచ్ వీక్షించిన గవర్నర్

విశాఖలో సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయనకు ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్, ఎంపీ సానా సతీష్ స్వాగతం పలికారు. స్టేడియంలో చేసిన ఏర్పాట్ల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. 30 మంది అనాథ పిల్లలకు మ్యాచ్ చూసే అవకాశం కల్పించిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ను గవర్నర్ అభినందించారు.
News March 24, 2025
శారదాపీఠంలోని ప్రభుత్వ భూముల గుర్తింపు నోటీసులు జారీ

శారదా పీఠంలోని ప్రభుత్వ భూములను గుర్తించి నోటీసులు జారీ చేశారు. చిన్నముషివాడ శారదా పీఠంలో సర్వే నెంబర్ 90లో 22 సెంట్లు రాస్తా ఆక్రమించారని, ఏడు నిర్మాణాలు తొలగించి ఖాళీ చేసి వెళ్లిపోవాలని పెందుర్తి తహశీల్దార్ శారద పీఠం మేనేజర్‌కు నోటీసులు అందించారు. ఇప్పటికే పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దర్యాప్తు చేపట్టారు.