News February 25, 2025

విశాఖ నుంచి షాలిమార్‌కు వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్

image

ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు విశాఖ- షాలిమార్‌కు(08508/07) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈ రైలు మార్చి 11 నుంచి ఏప్రిల్ 29వరకు ప్రతి మంగళవారం నడవనుంది. మంగళవారం విశాఖలో బయలుదేరి బుధవారం షాలిమార్ చేరుకుంటుంది. మళ్లీ బుధవారం షాలిమార్ నుంచి బయలుదేరి గురువారం విశాఖ చేరుతుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

Similar News

News January 8, 2026

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికుడి మృతి

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో ఓ కార్మికుడు మృతి చెందాడు. అజీమాబాద్‌కు చెందిన మహమ్మద్ సుబాన్ (41) ప్లాంట్‌లోని ఫ్రెండ్స్ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం సెంటర్ ప్లాంట్ విభాగంలో పనులు ముగించుకుని కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 8, 2026

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి ఘన స్వాగతం

image

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురాం రాజు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి విశాఖలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనను కలిసిన వారిలో పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.

News January 8, 2026

విశాఖలో రేపు డీఆర్సీ సమావేశం

image

విశాఖలో డీఆర్సీని జనవరి 9న నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఇన్‌ఛార్జ్‌ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఈ సమీక్షలో పాల్గొననున్నారు. పక్కా నివేదికలతో అధికారులు హాజరు కావాలని ఆయన ఆదేశించారు. అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, గతంలో చర్చించిన సమస్యలకు తీసుకున్న పరిష్కార చర్యలను తెలుపుతూ నివేదికలు తీసుకురావాలన్నారు. ప్రజా ప్రతినిధులు అడిగే ప్రశ్నకు సమాధానం ఇచ్చేలా ఉండాలని సూచించారు.