News March 14, 2025

విశాఖ నుంచి షాలిమార్, చర్లపల్లికి ప్రత్యేక రైళ్ళు

image

హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి షాలిమార్(08577/78), చర్లపల్లికి(08579/80) స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ గురువారం తెలిపారు. ఈ రైళ్లు విశాఖ నుంచి మార్చి 16 తేదీన బయలుదేరి మార్చి 17న తిరుగు ప్రయాణంలో విశాఖ చేరుతాయన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

Similar News

News March 27, 2025

విశాఖలో డ్రగ్స్ కలకలం

image

విశాఖ త్రీటౌన్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓ డార్మెటరీలో 6.5 గ్రాముల ఎం.డి.ఎం.ఏతో కర్ణాటకకి చెందిన రంగస్వామి నంజి గౌడ (23)గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని త్రీటౌన్ పోలీసులకు అప్పగించారు. అయితే నంజి గౌడ చాలాసార్లు సిటీకి వచ్చినట్లు సమాచారం. అతను ఎవరికి డ్రగ్స్ అమ్ముతున్నాడో తెలియాల్సి ఉంది.

News March 27, 2025

విశాఖ: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

అన్నవరం నుంచి విశాఖ వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. తుని ఎస్‌ఐ విజయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన పద్మ (48) అన్నవరంలో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లింది. బుధవారం అక్కడి నుంచి తన కుమారుడి బైక్‌పై విశాఖ వస్తుండగా తుని RTC కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఫ్లైఓవర్‌పై కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కింద పడిపోయారు. ఆమె పైనుంచి కారు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

News March 27, 2025

వాగన్ పోహ్ వర్క్‌షాప్ తనిఖీ చేసిన DRM

image

వడ్లపూడిలో ఉన్న వ్యాగన్ పీరియాడిక్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ను DRM లలిత్ బోహ్రా బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వర్క్‌షాప్‌లోని వివిధ పీవోహెచ్ సౌకర్యాలు, యంత్రాలు, కార్యాలయాన్ని పరిశీలించారు. రైల్వే వ్యాగన్‌ల లభ్యతను పెంచడానికి లక్ష్య ఉత్పత్తిని చేరుకోవాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా జగ్గయ్యపాలెంలో కంటైనర్ కార్పొరేషన్‌లో సౌకర్యాలను పరిశీలించారు.

error: Content is protected !!