News April 3, 2024
విశాఖ: నేటి నుంచి పెన్షన్ల పంపిణీ

ఎన్నికల నిబంధనల మేరకు సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభించేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలల పెన్షన్లు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది సచివాలయాల్లో అందజేస్తారన్నారు. పింఛనుదారులు ఆధార్ కార్డు తీసుకొని సచివాలయానికి రావాలన్నారు. 7వ తేదీ వరకు ఉదయం 7.30 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ జరుగుతుందన్నారు.
Similar News
News December 16, 2025
విశాఖ: సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు

పూసపాటిరేగకు చెందిన వాసుపల్లి రాములు (55) సముద్రంలో గల్లంతయ్యాడు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి శుక్రవారం బోటులో వేటకు వెళ్లాడు. ఆదివారం రాత్రి తీరానికి 70 మైళ్ల దూరంలో ఆయన ప్రమాదవశాత్తు బోటుపై నుంచి సముద్రంలో జారిపడ్డాడు. సహచర సిబ్బంది గాలించినా ఆచూకీ లభించలేదని, మంగళవారం సాయంత్రం ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసినట్లు పోర్ట్ సీఐ రమేశ్ తెలిపారు.
News December 16, 2025
2026 ఏప్రిల్ నుంచి విశాఖలో ఏఐ (AI) ట్రాఫిక్ సిస్టమ్

విశాఖను ప్రపంచ స్థాయి ఆదర్శ పోలీసింగ్ నగరంగా మార్చేందుకు సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ‘సెవెన్ డ్రీమ్స్’ (Seven Dreams) ప్రణాళికను ప్రకటించారు. వీసీఎస్సీ (VCSC) సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026 ఏప్రిల్ నాటికి ఏఐ (AI) ట్రాఫిక్ వ్యవస్థ, మహిళా రక్షణ, హోమ్ గార్డుల సంక్షేమం, నైట్ విజన్ కెమెరాలు, డ్రోన్లు, బీచ్ భద్రత, బాలికలకు హెచ్పీవీ టీకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
News December 16, 2025
విశాఖ: వృద్ధురాలి కాళ్లు, చేతులు కట్టేసి బంగారం చోరీ

ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధి ధారపాలెంలో దొంగలు రెచ్చిపోయారు. సోమవారం తెల్లవారుజామున బంగారమ్మ తల్లి లేఔట్లో నివసిస్తున్న వసంత (66) అనే వృద్ధురాలు నిద్రిస్తుండగా సుమారు ఇంట్లోకి దొంగలు చొరపడ్డారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఇంట్లో ఉన్న సుమారు 10 తులాల బంగారం, 8 తులాల వెండి దోచుకుని పరార్ అయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆరిలోవ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


