News January 7, 2025
విశాఖ: నేటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాలు ధరలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణను మంగళ, బుధవారాల్లో చేపట్టనున్నట్లు APEPDCL సీఎండీ పృథ్వీ తేజ్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుందన్నారు. ఏపీఈఆర్సీ ఛైర్మన్ ఠాగూర్ రామ్ సింగ్ ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థల ప్రతిపాదనలకు సూచనలు అభ్యంతరాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వీకరిస్తారని అన్నారు.
Similar News
News November 21, 2025
విశాఖ: ‘దళారులకు గంటా వార్నింగ్’

తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ భూములకు శనివారం నుంచి పరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఎకరాకు రూ.20 లక్షలు, 20 సెంట్ల భూమి ఇస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ ధర ఇప్పిస్తామని రైతులను మోసం చేస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. న్యాయమైన రైతుల కోరికలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
News November 21, 2025
నేడు గ్రేటర్ విశాఖ కౌన్సిల్ సమావేశం

జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరగనుండగా ఈ సమావేశంలో చర్చించేందుకు మొత్తం 90 అంశాలతో అజెండాను సిద్ధం చేశారు. వీటిలో ప్రధానంగా నగరంలోని వివిధ వార్డుల అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైనేజీ, వాటర్సప్లై వంటి మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. ముందస్తు వ్యూహరచనలో భాగంగా వైసీపీ తరఫున షాడో సమావేశాన్ని ఇప్పటికే నిర్వహించారు. సమావేశం ఉత్కంఠభరితంగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News November 21, 2025
నిర్దిష్ట గడువులోగా మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం: కలెక్టర్

వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్ గురువారం మాస్టర్ ప్లాన్ రహదారులను పరిశీలించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ 7 మాస్టర్ ప్లాన్ రహదారులను రూ.175 కోట్లతో నిర్మిస్తున్నారు. వీటిని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ రహదారుల వల్ల జాతీయ రహదారిపై రద్దీ తగ్గుతుందని అన్నారు. సీఈ వినయ్ కుమార్ పాల్గొన్నారు.


