News August 9, 2024
విశాఖ: నేడు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే కూటమి అభ్యర్థిని చంద్రబాబు సమక్షంలో శుక్రవారం ఖరారు చేయనున్నారు. ఈ విషయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో విశాఖ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం అభ్యర్థి పేరును ప్రకటించనున్నట్లు తెలిపారు.
Similar News
News January 22, 2026
విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం

విశాఖపట్నంలో కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఇమ్మిగ్రేషన్ బ్యూరో కార్యాలయం ఏర్పాటు కానుంది. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలకు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలు విశాఖలోనే అందుబాటులోకి వస్తాయి. హైదరాబాద్, చెన్నైపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. హోం మంత్రిత్వ శాఖ విశాఖ నగరంలోని మారిక వల్ల సమీపంలోని ఓజోన్ వ్యాలీ లేఔట్‌లో ఏర్పాటుకు చర్యలు మొదలుపెట్టింది.
News January 22, 2026
విశాఖ: కాంబోడియాకు యువతను తరలిస్తున్న వ్యక్తిపై పీడీ యాక్ట్

కాంబోడియాకు యువతను విశాఖ నుంచి తరలిస్తున్న ప్రధాన ఏజెంటు బొంగు మురళిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానికంగా భావన ఫ్యాబ్రికేటర్స్ వర్క్ ఏర్పాటు చేసి ఉపాధి పేరుతో యువకులను కాంబోడియా తరలిస్తుండగా గతంలో అరెస్టు చేశారు. మరోసారి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆయనపై పీడీ యాక్ట్ పెడుతున్నట్లు తెలిపారు.
News January 21, 2026
జీవీఎంసీ సేవలకు సహకరించండి: కమిషనర్

విశాఖ నగర అభివృద్ధి, స్వచ్ఛ సర్వేక్షన్-2025లో ఉత్తమ ర్యాంకు సాధనకు నివాసిత సంక్షేమ సంఘాలు (RWAs) సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. బుధవారం జరిగిన సమావేశంలో సంఘాల ప్రతినిధులు రోడ్లు, డ్రైనేజీ, పార్కుల సమస్యలను ప్రస్తావించారు. సమస్యల తక్షణ పరిష్కారానికి ‘పురమిత్ర’ యాప్ టోల్ ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలన్నారు. కాలనీల్లోని పార్కుల నిర్వహణ బాధ్యతను సంఘాలే తీసుకోవాలని సూచించారు.


