News November 2, 2024
విశాఖ: నేడు రుషికొండ భవనాలను పరిశీలించనున్న సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్లో రుషికొండకు చేరుకుంటారు. గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను పరిశీలిస్తారు. తర్వాత అక్కడి నుంచి కలెక్టరేట్‌కు వెళతారు. అక్కడ సమీక్షా సమావేశం అనంతరం సాయంత్రం 4.30 గంటలకు కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్‌కు చేరుకుని హెలికాప్టర్లో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్తారు.
Similar News
News December 2, 2025
మహిళ ఫొటోలు మార్ఫింగ్ చేసిన వ్యక్తి అరెస్ట్: విశాఖ సీపీ

తన వాట్సాప్ స్టేటస్ ఫొటోలను డౌన్లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేసి (నగ్నంగా ఉండేటట్లు చిత్రీకరించి) సోషల్ మీడియాలో పెట్టినట్టు ఓ మహిళ విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేసి కాకినాడకు చెందిన తాటికాయల దివాకర మారుతి సత్యతేజ్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు.
News December 1, 2025
విశాఖ: ఆర్కే బీచ్‌లో ప్రమాద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

ఆర్కే బీచ్‌కు వచ్చే పర్యాటకుల భద్రత దృష్ట్యా నగర పోలీసులు చర్యలు చేపట్టారు. త్రీ టౌన్ సీఐ పైడయ్య ఆధ్వర్యంలో బీచ్‌లోని ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. “ఇచ్చట స్నానం చేయడం ప్రమాదకరం” అని హెచ్చరిస్తూ, అత్యవసర సహాయం కోసం సీఐ, టోల్ ఫ్రీ నంబర్లను (1093, 112) పొందుపరిచారు. పర్యాటకులు సముద్రంలో లోతుగా వెళ్లవద్దని పోలీసులు సూచించారు.
News December 1, 2025
విశాఖ జిల్లాలోని స్కూళ్లలో పిల్లలకు ఉదయం స్నాక్స్

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారంలో మూడు రోజుల మార్నింగ్ న్యూట్రిషన్ అందించేందుకు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అక్షయపాత్ర సహకారంతో కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. తొలి విడతగా 178 పాఠశాలల్లో ప్రారంభించి, త్వరలో అన్ని పాఠశాలలకు విస్తరించనున్నారు. ఉదయం అల్పాహారం లేక తరగతులకు వచ్చే పిల్లలకు చిరుతిండ్లు వంటివి అందించనున్నారు.


