News April 5, 2024
విశాఖ: నేడు, రేపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
ఉమ్మడి విశాఖ జిల్లాలో శుక్ర, శనివారాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని 25 మండలాల్లో తీవ్రవడగాలులు, 8 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. శనివారం 23 మండలాల్లో తీవ్ర, మరో 18 మండలాల్లో వడగాలులు వీయొచ్చని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News February 5, 2025
పీఏసీ సభ్యుడిగా విష్ణుకుమార్ రాజు
రాష్ట్ర ప్రజాపద్ధుల కమిటీ సభ్యుడుగా పెనుమత్స విష్ణుకుమార్ రాజు నియమితులయ్యారు. విష్ణుకుమార్ రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శాసనసభలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివిధ కమిటీల సభ్యుల పేర్లను మంగళవారం ప్రకటించారు. ప్రజా పద్దుల కమిటీలో విష్ణుకుమార్ రాజుకు స్థానం లభించింది.
News February 5, 2025
విశాఖ: ఎమ్మెల్సీ బరిలో స్వతంత్ర అభ్యర్థి
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల ఆనందపురం ఎంఈవోగా పదవీ విరమణ చేసిన ఎస్.ఎస్.పద్మావతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె నామినేషన్ పత్రాలను కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎటువంటి రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ యూనియన్లతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
News February 5, 2025
గంటల వ్యవధిలో యువతి ఆచూకీ కనిపెట్టిన పోలీసులు
ఎంవీపీ పోలీస్ స్టేషన్కు ఒక యువతి తప్పిపోయినట్లు మంగళవారం ఫిర్యాదు అందింది. ఫిర్యాదుపై వెంటనే స్పందించి టెక్ సెల్, సీసీటీవీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సదరు యువతిని పీఎం పాలెంలో ఉన్నట్లు గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. గంటల వ్యవధిలో తప్పిపోయిన యువతి ఆచూకీ కనుగొన్న ఎంవీపీ పోలీస్ స్టేషన్ సిబ్బందిని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి అభినందించారు.